KTR vs Rahul Gandhi: రాజధాని హైదరాబాద్‌ ప్రాంతానికి తాగునీరు కోసం నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టులో జరిగిన ప్రమాదం తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కింది. సుదీర్ఘ కాలం పాటు హైదరాబాద్‌కు తాగునీటి కొరత తీర్చే సద్దుదేశంతో నిర్మించిన ఈ ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యానికి ప్రమాదం బారిన పడిందని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై అధికార కాంగ్రెస్‌ ప్రతి విమర్శలు చేసింది. అయితే వాస్తవాలను వక్రీకరించి సుంకిశాల ప్రాజెక్టు నెపాన్ని తమపై నెట్టేస్తుండడంతో కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. స్థానిక నాయకత్వానికి కాకుండా కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీకే ప్రశ్నలు సంధించారు. సుంకిశాల ప్రాజెక్టుపై రాహుల్‌ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chandrababu: ప్రతి రెండో శనివారం తెలంగాణకు టైమ్‌ ఇస్తా: చంద్రబాబు


'కోట్లాది రూపాయల నష్టం జరిగిన తర్వాత కూడా సుంకిశాల ప్రమాదాన్ కాంగ్రెస్‌ పార్టీ చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. లోపభూయిష్టంగా పనులు చేసిన కాంట్రాక్టింగ్ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు, ఎందుకు ఆపుతున్నారో చెప్పాలి' అని కేటీఆర్‌ ప్రశ్నించారు. సుంకిశాల ప్రమాదం వ్యవహారంలో నిష్పాక్షికంగా విచారణ జరిగేలా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారు' అని నిలదీశారు. ఈ మొత్తం ప్రమాదాన్ని చిన్నదిగా కప్పిపుచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో, దీనికి బాధ్యులు ఎవరో తెలుపాలని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా సుంకిశాల ప్రమాదం వీడియోను 'ఎక్స్‌'లో పంచుకుంటూ కేటీఆర్‌ రాహుల్‌ గాంధీకి ప్రశ్నలు జరిపించారు.

Also Read: KTR Jail: అవినీతి కేసులో కేటీఆర్‌ జైలుకు ఖాయం: బండి సంజయ్ వ్యాఖ్యలతో కలకలం


ఏం జరిగింది?
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు చేరువగా హైదరాబాద్‌ తాగునీటి కోసం సుంకిశాల ప్రాజెక్టు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌, మున్సిపల్‌ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. 2024 వేసవికాలం వరకు ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువచ్చి హైదరాబాద్‌ ప్రజలకు తాగునీరు అందించాలని లక్ష్యంగా విధించారు. అయితే అనూహ్యంగా ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడంతో సుంకిశాల ప్రాజెక్టు పనులు నెమ్మదించాయి. దీనిపై విమర్శలు రావడంతో వర్షాకాలంలో పనులు మొదలుపెట్టగా అప్పటికే నాగార్జున సాగర్‌కు భారీగా వరద రావడంతో సుంకిశాల ప్రాజెక్టు పనులకు అవాంతరం ఎదురైంది. అయినా కూడా పనులు జరుపుతుండడంతో ఈనెల 2వ తేదీన ఈ ప్రాజెక్టు టన్నెల్‌ కూలింది. ప్రస్తుతం ఈ ఘటనపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది. ఈ క్రమంలోనే రాహుల్‌ గాంధీకి కేటీఆర్‌ ప్రశ్నలు సంధించారు.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter