KT Rama Rao Farm House: తెలంగాణలో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుండడంతో అక్రమ నిర్మాణదారులు బెంబేలెత్తుతున్నారు. చెరువు పరిధిలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన ఇళ్లు, ఫామ్‌హౌజ్‌లను కూల్చివేస్తున్నారు. దీంతో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఇక హైడ్రా కేటీఆర్‌ ఫామ్‌హౌజ్‌పై దాడి చేస్తుందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో జన్‌వాడ గ్రామంలో ఉన్న ఫామ్‌హౌజ్‌పై ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో అది కేటీఆర్‌కు సంబంధించిన ఫామ్‌హౌజ్‌ అని చర్చ జరుగుతున్న వేళ కేటీఆర్‌ స్పష్టత ఇచ్చారు. తనకు ఎలాంటి ఫామ్‌హౌజ్‌ లేదని ప్రకటించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: BRS Party: తెలంగాణలో ముదురుతున్న 'అసభ్య' వివాదం.. రేవంత్‌ రెడ్డిపై ఠాణాలో ఫిర్యాదు


 


హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో బుధవారం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా కేటీఆర్‌ను హైడ్రా కూల్చివేతలపై ప్రశ్నించారు. తన ఫామ్‌హౌజ్‌గా ప్రచారం అవుతున్న జన్‌వాడ ఫామ్‌హౌస్‌పై స్పందించారు. 'నాకు ఎలాంటి ఫామ్‌హౌజ్‌ లేదు. నా స్నేహితుడి ఫామ్‌హౌజ్‌ను లీజుకు తీసుకున్నా అంతే. అది ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉంటే తప్పక కూల్చివేయండి. కావాల్సి వస్తే నా స్నేహితుడికే చెబుతా' అని తెలిపారు.

Also Read: DK Aruna: రేవంత్‌ రెడ్డి అడ్డాలో గద్వాల జేజమ్మ గర్జన.. ఈగ వాలినా ఊరుకోను


 


ఈ క్రమంలో మంత్రులు, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు. 'ఎఫ్‌టీఎల్‌ పరిధిలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, గుత్తా సుఖేందర్‌ రెడ్డి, కేవీపీ, పట్నం మహేందర్‌ రెడ్డి, మధు యాష్కీ తదితరుల ఫామ్‌హౌజ్‌లు కూడా కూల్చాలి' అని చెప్పారు.. 'ప్రజలకు పారదర్శకంగా ఉందని ప్రభుత్వం చూపించాలి కదా? వాళ్ల ఫామ్‌హౌజ్‌లు కూడా కూల్చివేయాలి' అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. రేవంత్‌ రెడ్డికి కూడా ఫామ్‌హౌజ్‌ ఉందని.. అది ఎక్కడ ఉందో తాను చెబుతా అని కీలక ప్రకటన చేశారు. వీ6 వివేక్‌ వెంకటస్వామి ఇల్లు కూడా ఉందని ప్రకటించారు. 'నా ఆస్తులకు సంబంధించి ఎన్నికల అఫిడవిట్‌లో అన్ని వివరాలు ఉన్నాయి. దానిలో దాచుకునేది ఏదీ లేదు' అని స్పష్టం చేశారు.


హైకోర్టు ఆశ్రయం.
జన్‌వాడ ఫౌంహౌస్ కూల్చోద్దంటూ ప్రవీణ్‌ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలను హైడ్రా కూలుస్తుండడంతో తన ఫామ్‌హౌజ్‌ కూడా కూలుస్తారనే భయంతో ప్రవీణ్‌ రెడ్డి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ కట్టడాలను హైడ్రా కూల్చే అవకాశం ఉండడంతో ముందస్తు పిటిషన్ వేశారు. హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం, హైడ్రా కమిషన్, రంగారెడ్డి కలెక్టర్, శంకర్‌పల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్, చెరువుల పరిరక్షణ కమిటీ సభ్యులను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. అతడి పిటిషన్‌ను స్వీకరించి విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం, హైడ్రా కమిషన్‌కు నోటీసులు జారీ చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter