KT Rama Rao: నా హైదరాబాద్ సేఫ్.. ట్విటర్లో హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్
KT Rama Rao Surprised Hyderabad Inundated: భారీ వర్షాలు కురిసినా హైదరాబాద్‌లో వరద ముప్పునకు గురి కాకపోవడంపై మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
KT Rama Rao Surprise: కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో తెలంగాణలో కొన్ని ప్రాంతాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లడంతో నల్లగొండ, ఖమ్మం, ములుగు జిల్లాలు ప్రభావితమయ్యాయి. అత్యధిక వర్షపాతం కురుస్తున్నా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మాత్రం ప్రభావితానికి గురి కాలేదు. అతి పెద్ద నగరానికి వరద ముప్పు మాత్రం వాటిల్లలేదు. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసినా కూడా వరద ప్రభావం లేకపోవడంతో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తమ ప్రభుత్వ ఘనతగా చెప్పారు. ఈ విషయమై ఆయన 'ఎక్స్' వేదికగా స్పందించారు.
Also Read: Supreme Court: రేవంత్ రెడ్డి మెడకు కవిత బెయిల్.. సుప్రీంకోర్టు ఆగ్రహంతో మరో కేసు?
'నిన్న కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలు ముంపునకు గురికాలేదని వినడానికి చాలా ఆనందంగా ఉంది. ఎస్‌ఎన్‌డీపీ (నాలా అభివృద్ధి కార్యక్రమం) హైదరాబాద్‌లో క్రమబద్ధమైన పునర్వ్యవస్థీకరణ, జవాబుదారీతనంతో స్పష్టమైన ఉద్దేశంతో పరిణాత్మక మార్పును తీసుకొచ్చింది. హైదరాబాద్ కోసం బీఆర్‌ఎస్ పార్టీ దార్శనికతకు జీవం పోయడానికి మా అసాధారణమైన ఇంజనీర్ల బృందం, అన్ని విభాగాలు కలిసికట్టుగా పని చేశారు. వారి సహకారం.. ఏ కృషి లేకుండా ఈ విజయం సాధ్యమయ్యేది కాదు' అని కేటీఆర్ తెలిపారు.
Also Read: Mokila Villas: వరదల్లో చిక్కుకున్న లగ్జరీ విల్లాలు.. కోటీశ్వర్లు కూడా రోడ్డు మీదకు
'మీ అంకితభావం వల్లే ఈరోజు హైదరాబాద్ మరింత బలంగా, మెరుగ్గా ఉంది. నాతో పాటు నిలబడి ఈ నగరాన్ని ప్రగతికి నమూనాగా మార్చినందుకు ధన్యవాదాలు' అని నాడు తాను మంత్రిగా పని చేసిన సమయంలో సహకరించిన జీహెచ్‌ఎంసీ, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన నాలాల అభివృద్ధితో హైదరాబాద్‌కు వరద ముప్పు తప్పిందని సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter