Supreme Court: రేవంత్ రెడ్డి మెడకు కవిత బెయిల్.. సుప్రీంకోర్టు ఆగ్రహంతో మరో కేసు?

Supreme Court Serious On Revanth Reddy Comments On Kavitha Bail: న్యాయ వివాదంలో మరోసారి రేవంత్‌ రెడ్డి చిక్కుకున్నారు. కవిత బెయిల్‌ అంశంలో ఆయనకు భారీ షాక్‌ తగిలింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 2, 2024, 02:45 PM IST
Supreme Court: రేవంత్ రెడ్డి మెడకు కవిత బెయిల్.. సుప్రీంకోర్టు ఆగ్రహంతో మరో కేసు?

Revanth Reddy Kavitha Bail: అధికారంలోకి వచ్చాక.. రాక ముందు కూడా రేవంత్‌ రెడ్డి వ్యవహారం దూకుడుగా ఉంది. మాస్‌ నాయకుడిగా గుర్తింపు పొందాలనుకున్న క్రమంలో ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం.. దూకుడుతనంతో దూసుకెళ్తుండడంతో తరచూ వివాదంలో చిక్కుకుంటున్నారు. ఆయన వ్యవహార శైలే వివాదాస్పదంగా ఉంటోంది. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న రేవంత్‌ రెడ్డి తాజాగా న్యాయ వివాదంలో చిక్కుకున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ అంశంలో సుప్రీంకోర్టు తీర్పునే రేవంత్‌ రెడ్డి తప్పుబట్టారు. కవిత బెయిల్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అతడి వ్యాఖ్యలపై న్యాయ నిపుణులతోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీ, బీజేపీలు కూడా తప్పుబడుతున్నాయి. 

Also Read: Khammam Floods: వరద సహాయాల్లో అపశ్రుతి.. బైక్‌పై నుంచి కిందపడ్డ పొంగులేటి శ్రీనివాస్‌

 

తామిచ్చిన బెయిల్‌ను తప్పుబట్టడంతో రేవంత్‌ రెడ్డి తీరును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడింది. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మందలింపు చేసింది. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని రేవంత్‌కు హితవు పలికింది. అయితే కవిత బెయిల్‌ అంశంపై చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు విడిచిపెట్టే అవకాశం లేనట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో రేవంత్‌ రెడ్డి నుంచి వివరణ కోరుతున్నట్లు సమాచారం.

Also Read: No Selfies: తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక! జలాశయాల వద్ద సెల్ఫీలు.. ఫొటోలు వద్దు

 

తీవ్ర పరిణామాలు?
బెయిల్‌ అంశంలో చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ పోస్టులపై సుప్రీంకోర్టు వివరణ కోరింది. తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్, వాట్సప్ గ్రూపుల్లో కవిత బెయిల్ అంశంపై వ్యాఖ్యలను న్యాయస్థానం సీరియస్‌గా పరిగణించింది. 'కవితకు బెయిల్ వచ్చిందా..? ఇచ్చారా ? ఈ రెండింటిలో ఏది కరెక్ట్?', 'కమలంతో స్నేహం.. తైతక్కకు మోక్షం' అని తెలంగాణ కాంగ్రెస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉండడంతో కవిత బెయిల్‌పై వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం కవిత బెయిల్‌ అంశంలో సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణిస్తే మాత్రం రేవంత్‌ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కోర్టు ధిక్కారణ కేసు ఎదుర్కొన ప్రమాదం ఉంది. కాగా ఇప్పటికే కవిత బెయిల్ అంశంపై రేవంత్‌ క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే. భవిష్యత్‌లో ఇలాంటి ధోరణి పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

గతంలో పలు వివాదాల్లో..
కవిత బెయిల్‌ అంశమే కాదు మరికొన్ని వివాదాల్లో కూడా రేవంత్‌ రెడ్డి చిక్కుకున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో 'రిజర్వేషన్లు ఎత్తివేస్తున్నారు' అని రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్‌ కొన్ని పోస్టులు కూడా చేసింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. అంతకుముందు పలు అంశాల్లోనూ రేవంత్‌ దూకుడుగా వ్యవహరించారు. పలు న్యాయపరమైన అంశాల్లో అతడి తీరు వివాదాస్పదంగా ఉంది. ఓటుకు నోటు వ్యవహారంలో కూడా ఇదే తీరున వ్యవహారించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News