Governor Vs Government: కేసీఆర్ అవమానించారన్న గవర్నర్ తమిళి సై.. కౌంటరిచ్చిన కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వ తీరుపై మాట్లాడుతూ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ భావోద్వేగానికి గురయ్యారు. సీఎం కేసీఆర్ అవమానించరని ఆవేదన వ్యక్తం చేయగా, తమ ప్రభుత్వంపై తమిళిసై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
Governor Vs Government: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కేంద్రం పెద్దలతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వ తీరుపై మాట్లాడుతూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ సర్కార్ తీరుపై తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన తల్లి రాజ్ భవన్ లో చనిపోతే సీఎం చూసేందుకు కూడా రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి తనను పరామర్శించారు కానీ.. కేసీఆర్ మాత్రం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదన్నారు. సీఎం కేసీఆర్‌ని ఒక అన్నగా భావించానని.. కాని ఆయన మాత్రం తనను అవమానించారని తమిళి సై అన్నారు.
తెలంగాణలో డ్రగ్స్ కేసు, అవినీతిపై ప్రధానమంత్రి మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాలకు నివేదిక ఇచ్చానని తమిళి సై తెలిపారు. డ్రగ్స్‌తో యువత నాశనం అవుతున్నారని, ఓ తల్లిగా బాధపడుతూ మోడీకి నివేదిక ఇచ్చానన్నారు. తెలంగాణ వ్యవహారాల పట్ల ప్రధాని, హోంశాఖ మంత్రి అసంతృప్తిగా ఉన్నారన్నారు . ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకునే అధికారం ఉన్నప్పటికీ.. అలా చేయనని గవర్నర్ స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వంపై ఎలాంటి కోపం లేదని తేల్చిచెప్పారు. గవర్నర్లతో విభేదించిన ముఖ్యమంత్రులుగా పనిచేసిన కరుణానిధి, జయలలిత, మమత ఆయా రాష్ట్రాలు నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమాలకు పిలిచే వారని తమిళి సై గుర్తుచేశారు. తెలంగాణలో ఆస్పత్రుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. యూనివర్సిటీలో 60 శాతం ఖాళీలు ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నారని తమిళిసై తప్పుబట్టారు.
మరోవైపు గవర్నర్ వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి కేటీఆర్. తమ ప్రభుత్వంపై తమిళిసై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గవర్నర్ అంటే తమకు అపారమైన గౌరవం ఉందని చెప్పారు. తాము గవర్నర్ తమిళిసైని ఎక్కడ అవమానించలేదని స్పష్టం చేశారు. పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో మాట్లాడిన మాటలు తమను బాధించాయని తెలిపారు. గవర్నర్‌గా నరసింహన్ ఉన్నప్పుడు తమ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది రాలేదన్నారు కేటీఆర్.
Also Read: RRR Records: ఆర్ఆర్ఆర్ అరుదైన రికార్డు- బాలీవుడ్ సినిమాలకు పోటీగా కలెక్షన్లు
Also Read: Realme GT 2 Pro: మార్కెట్లోకి రియల్మీ జీటీ 2 ప్రో- ఫీచర్లతో పాటు ఆఫర్లూ అదుర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook