నల్గొండ జిల్లా హుజుర్ నగర్ కార్యకర్తల సమావేశంలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందస్తు ఎన్నికలకు వెళ్లి తెలంగాణ సీఎం కేసీఆర్ చరిత్రను తిరగరాశారని మంత్రి కేటీఆర్ ప్రసంశించారు. పంచాయితీ ఎన్నికల్లో కూడా ఇలాంటి గెలుపును సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ విమర్శల దాడికి దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ లో ఒక్క ఉత్తమ్ కుమార్ తప్పితే అన్ని పెద్దతలకాయలన్నీ ఓటమి పాలయ్యారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎన్నికల్లో కారును పోలిన ట్రక్కు గుర్తు వల్లే ఉత్తమ్ గెలుపొందారని ఎద్దేవ చేశారు. లేదంటే మిగిలిన కాంగ్రెస్ సీనియర్ నేతలకు పట్టిన గతే ఉత్తమ్ కుమార్ కు పట్టి ఉండేదని.. అదృష్టం బాగుండి ఆయన ఇలా బటయపడ్డారని కేటీఆర్ వివరించారు. 


ఓడినా..అహం చావ లేదు 
ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్ నేతల్లో అహంకారం చావలేదని కేటీఆర్ విమర్శించారు. జిల్లా పరిషత్ సమావేశాలకు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఎన్నడూ హాజరు కాలేదని ఈ సందర్భంగా కేటీఆర్ విమర్శించారు. వీళ్ల వైఖరి నచ్చకనే ప్రజలు వాళ్లను తిరస్కరించారని కేటీఆర్ విమ్శించారు. ఈ సందర్భంగా జానారెడ్డి కూడా ఓటమిని కూడా ప్రస్తావించి కేటీఆర్ విమర్శలు సంధించారు. ఓటమి ఎరుగని చరిత్ర అన్నారు..ఇప్పుడు ఏమైంది.. ప్రజల సమస్యలపై స్పందిస్తేనే ఓట్లు వేస్తారు.. మాటలతో ఓట్లు రావని తెలుసుకోవాల్సి ఉందని కేటీఆర్ ఎద్దేవ చేశారు.


చెల్లని చంద్రబాబును మాపై ఉసిగొల్పారు..
చంద్రబాబును తెలంగాణ ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని.. కాంగ్రెస్ నేతలు ఆయనను మళ్లీ పట్టుకొచ్చారని గెలువాలని కోవడం వాళ్ల మూర్ఖత్వంమని కేటీఆర్ విమర్శించారు. చెల్లని చంద్రబాబు తమపై ఉసిగొల్పారు.. ఫలితం ఎలా ఉంటుందో కాంగ్రెస్ వారు రుచిచూశారని కేటీఆర్ ఎద్దేవ చేశారు. మహాకూటమి పేరుతో ఎన్ని డామాలు ఆడినా.. ప్రజలు మాత్రం కాంగ్రెస్ నేతలకు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. 


పంచాయితీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
హుజుర్ నగర్ లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ సమక్షంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ లోకి చేరారు. ఈ సందర్భంగా పంచాయితీ ఎన్నికలో టార్గెట్ గా పెట్టుకొని గెలుపుకోసం ప్రయత్నించాలని ఈ సందర్భంగా కార్యకర్తలుకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పరిస్థితి చూస్తే తన జాలేస్తుందని.. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితిలో ఆ పార్టీ లేదని కేటీఆర్ ఈ సందర్భంగా ఎద్దేవ చేశారు