KTR In Davos World Economic Forum: స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించగలుగుతున్నారు. తాజాగా మరో ప్రముఖ కంపెనీ ఆశీర్వాద్ పైప్స్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో రూ.500 కోట్ల మేర పెట్టుబడులకు ఆ సంస్థ మంత్రి కేటీఆర్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ మేరకు ఆశీర్వాద్ పైప్స్ మాతృ సంస్థ అలియాక్సిస్ కోయిన్ స్టికర్ కేటీఆర్‌తో భేటీ అయి దీనిపై చర్చించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజా ఎంవోయూ ప్రకారం తెలంగాణలో ఆశీర్వాద్ పైప్స్ గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్‌లో ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారుచేయనున్నారు. కేవలం దేశీ మార్కెట్ కోసం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఇతర దేశాలకు సైతం ఇక్కడి నుంచే ప్లాస్టిక్ ఉత్పత్తులు సప్లై చేసేలా ప్రొడక్షన్ జరగనుంది. ఆశీర్వాద్ పైప్స్‌తో కుదిరిన ఎంవోయూపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆశీర్వాద్ పైప్స్ ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.


తెలంగాణలో ప్లాస్టిక్ మాన్యుఫాక్చరింగ్ రంగానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆశీర్వాద్ పైప్స్ పెట్టుబడులతో ఈ రంగంలో మరిన్ని కంపెనీలు తెలంగాణకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆశీర్వాద్ పైప్స్ కంపెనీ ప్లాంట్‌కు ప్రభుత్వం తరుపున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. 


దావోస్‌లో ఈ నెల 22 నుంచి 26వరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ఇప్పటికే పలు కంపెనీల నుంచి తెలంగాణకు పెట్టుబడులు తీసుకురాగలిగారు కేటీఆర్. లులూ గ్రూప్‌, స్విస్ రే, కీమో తదితర సంస్థలు తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చాయి. తాజాగా ఆశీర్వాద్ పైప్స్ సంస్థ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. సదస్సు ముగిసేనాటికి మరిన్ని సంస్థలు తెలంగాణకు క్యూ కట్టే అవకాశం ఉంది. 



Also Read: Numerology Radix: పవర్‌ఫుల్ ర్యాడిక్స్ 8.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఈ ఏడాదంతా అదృష్టమే...


Also Read: High Tension in Amalapuram: అమలాపురంలో హైటెన్షన్... ఎస్పీ వాహనంపై రాళ్ల దాడి.. ఆందోళనకారులపై లాఠీఛార్జి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook