KTR Counter to Rahul: పొలిటికల్ టూరిస్టులు వస్తారు, పోతారు.. కానీ కేసీఆర్ లోకల్...
KTR indirect counter to Rahul: వరంగల్ సభలో తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
KTR indirect counter to Rahul: అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేశాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి. ఎన్నికల నాటికి జనంలో బలం పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నాయి. ఈ క్రమంలో బహిరంగ సభలు, పాదయాత్రలు, జాతీయ నేతల పర్యటనలు, నేతల మధ్య మాటల యుద్ధాలతో తెలంగాణ రాజకీయం అప్పుడే వేడెక్కింది. తాజాగా రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనతో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య గట్టి డైలాగ్ వార్ నడుస్తోంది.
రాహుల్ తాజా పర్యటనలో తెలంగాణ ప్రభుత్వంపై అనేక విమర్శలు, ఆరోపణలు చేశారు. అయితే వాటన్నింటినీ టీఆర్ఎస్ సర్కార్ లైట్ తీసుకుంటున్నట్లే కనిపిస్తోంది. తాజాగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. ఒకే ఒక్క డైలాగ్‌తో రాహుల్‌కు కౌంటర్ ఇచ్చారు. 'పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు... పోతుంటారు... కానీ కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణలోనే ఉంటారు...' అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ ట్వీట్‌లో పోస్ట్ చేసిన ఫోటోలో కేటీఆర్ పోజు చూస్తుంటే... తగ్గేదెలా అన్నట్లుగా ఉంది.
కేటీఆర్ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు నెటిజన్లు, టీఆర్ఎస్ మద్దతుదారులు కేటీఆర్ ట్వీట్‌ను సమర్థిస్తూ కామెంట్స్ చేశారు. తెలంగాణలో పర్యటించడం ద్వారా అసలైన పురోగతి దిశగా పయనిస్తున్న రాష్ట్రం ఎలా ఉంటుందో ఆ నేతలు తెలుసుకోగలుగుతారని టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్ రెడ్డి కామెంట్ చేశారు. 'కల్వకుంట్ల ఫ్యామిలీ ఢిల్లీకి, ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు అసలే వెళ్లట్లేదు. ఎప్పుడూ 7 స్టార్ ఫాం హౌస్‌లను మాత్రమే సందర్శిస్తుంటారు..' అని కాంగ్రెస్ మద్దతుదారు ఒకరు కేటీఆర్ కామెంట్‌కు కౌంటర్ ఇచ్చారు.
కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్ :
రాహుల్ గాంధీపై కేటీఆర్ పరోక్ష వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 'మీ దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్ట్ ప్లేస్ కావొచ్చు. కానీ కాంగ్రెస్ దృష్టిలో ఈ రాష్ట్రం అమరవీరుల త్యాగఫలం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. మీ వక్రదృష్టికి ప్రకారం ఇది టూరిస్ట్ ప్లేస్ అనుకున్నా... దాన్ని సృష్టించింది కాంగ్రెసే... అని కౌంటర్.' ఇచ్చారు.
టీఆర్ఎస్‌పై రాహుల్ విమర్శలు, ఆరోపణలు :
వరంగల్ రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు, ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. టీఆర్ఎస్ బీజేపీ చేతిలోని రిమోట్ కంట్రోల్ అని... తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండాలని బీజేపీ కోరుకుంటోందని అన్నారు. అందుకే సీఎం కేసీఆర్ అవినీతిపై కేంద్రం విచారణ జరిపించట్లేదన్నారు. టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ప్రసక్తే ఉండదని తేల్చేశారు. తమకు నష్టమని తెలిసినా తెలంగాణ ఇచ్చామని... వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు.
Also Read: TSRTC Mothers Day Gift: మాతృమూర్తులకు 'మదర్స్ డే' స్పెషల్ గిఫ్ట్... ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. Also Read: Horoscope Today May 7 2022: రాశి ఫలాలు... ఆ రాశి వారికి వివాహ విషయంలో కీలక సూచన... స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. |