Minister KTR Speech: మరో ఐదేళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందంటే..
Minister KTR Speech: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పురపాలనలో దేశంలోనే అద్భుతమైన ప్రగతి సాధించిన రాష్ట్రం తెలంగాణ అంటే అతిశయోక్తి లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ కార్యక్రమాలకు ఇచ్చిన అనేక అవార్డులు, ప్రశంసలే ఇందుకు నిదర్శనమన్నారు.
Minister KTR Speech: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పురపాలనలో దేశంలోనే అద్భుతమైన ప్రగతి సాధించిన రాష్ట్రం తెలంగాణ అంటే అతిశయోక్తి లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ కార్యక్రమాలకు ఇచ్చిన అనేక అవార్డులు, ప్రశంసలే ఇందుకు నిదర్శనమన్నారు. మహాత్మా గాంధీ అన్నట్లు పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అన్నమాట ఎంత వాస్తవమో, పట్టణాలు భారతదేశానికి ఆర్థిక ఇంజన్లు అనడం కూడా అంతే వాస్తవం అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 45 నుంచి 50% హైదరాబాద్ తో పాటు నగరాన్ని ఆనుకుని ఉన్న చుట్టుపక్కల ఉన్న పట్టణాల నుంచే వస్తోందని చెబుతూ.. ప్రపంచ వ్యాప్తంగా గత 5 వేల సంవత్సరాలలో జరిగిన పట్టణీకరణ స్థాయిలో రానున్న 50 సంవత్సరాలలో పట్టణీకరణ జరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి అని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది దినోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన పట్టణ ప్రగతి సంబరాలలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పాల్గొని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, " రానున్న ఐదు సంవత్సరాల్లో మెజార్టీ తెలంగాణ జనాభా పట్టణాల్లో నివాసం ఉంటుంది. ప్రజలే కేంద్ర బిందువుగా పరిపాలన సంస్కరణలను, పథకాలను తీసుకువస్తేనే పాలన విజయవంతం అవుతుందన్న విశ్వాసం ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఉంది. ఆ అలోచన మేరకే అనేక పరిపాలన సంస్కరణలను, నూతన పురపాలక పంచాయతీరాజ్ చట్టాలను, టీఎస్ బి పాస్ వంటి నూతన భవన నిర్మాణాలకు అనుమతుల ప్రక్రియను తీసుకురావడం జరిగింది " అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
రాష్ట్రంలోని పౌరులపైన విశ్వాసం ఉంచి, టిఎస్బి పాస్ కానీ లేదా పన్ను మదింపు విషయాల్లో సెల్ఫ్ అసెస్మెంట్ ప్రక్రియను తీసుకువచ్చాం. పరిశ్రమలకైనా, నివాస గృహాలకైనా నిర్ణీత సమయంలో, వేగంగా అనుమతులు ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. తెలంగాణలో ఈరోజు సమగ్ర, సమ్మిళిత, సంతులిత, సమతుల్య పరిపాలన కొనసాగుతున్నది. విప్లవాత్మకమైన ఆలోచన విధానంతో సమాజంలోని అన్ని వర్గాలను, పట్టణాలను, పల్లెలను ఎలాంటి తేడా లేకుండా ముందుకు తీసుకెళుతున్న ప్రభుత్వం మాది అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఐటీ పరిశ్రమల నుంచి అగ్రికల్చర్ వరకు అన్ని రంగాల్లోనూ అద్భుతమైన అభివృద్ధి సాధ్యమవుతోంది. కేసిఆర్ విధానాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్న ఘనత రాష్ట్రంలోని ఆరున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు దక్కుతుంది. నెలరోజుల వ్యవధిలో విజయవంతంగా హైదరాబాద్ నగరంలో 150 వార్డుల్లో వార్డ్ కార్యాలయ వ్యవస్థను ప్రారంభించి జిహెచ్ఎంసి ప్రజల పట్ల తన కమిట్మెంట్ ని చాటుకుంది అని చెబుతూ జిహెచ్ఎంసి సిబ్బందికి అభినందించారు.
ఇది కూడా చదవండి : Bandi Sanjay About Journalists Plots: వేల కోట్ల విలువైన జర్నలిస్టుల ఇళ్ల స్థలంపై కేసీఆర్ కన్ను పడింది
ప్రజలంతా భయాందోళనకు గురైన కరోనావైరస్ వ్యాప్తి సంక్షోభ కాలంలోనూ జిహెచ్ఎంసి అధికారులు రోడ్ల నిర్మాణం, లింకు రోడ్ల నిర్మాణం, బ్రిడ్జిల నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణ వంటి కార్యక్రమాల్లో ప్రాణాలకు తెగించి పాల్గొన్నారు. భారతదేశంలో అత్యధిక వేతనం అందుకుంటున్న పారిశుధ్య కార్మికులు తెలంగాణలో ఉన్నారని గర్వంగా చెప్పవచ్చు. కానీ వారు చేసే సేవలకు ఎంత చేసిన తక్కువే. మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సాధారణ పౌరుడి కోణంలో ఆలోచించి, ప్రభుత్వ పథకాలను పరిపాలన విధానాలను రూపొందిస్తారు. దేశ జనాభాలో 3 శాతం కన్నా తక్కువగా ఉన్న తెలంగాణ రాష్ట్రం కేంద్రం ఇచ్చే అవార్డులో 30 శాతానికిపైగా గెలుచుకుంటున్నది అంటే అది మన పని తీరు వల్లే సాధ్యమైంది అని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి : YS Sharmila: కేసీఆర్, కేటీఆర్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
ఇది కూడా చదవండి : Komatireddy Venkat Reddy: నేనే స్టార్ క్యాంపెయినర్.. ప్రియాంక గాంధీతో కోమటిరెడ్డి భేటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK