Lagacharla Incident: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. రేవంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో దారుణ పరిస్థితులు ఉన్నాయని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీమంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. 11 నెలలుగా కొడంగల్‌లో అరాచక పాలన సాగుతోందని.. అధికార మదంతో విర్రవీగుతున్న నియంత రేవంత్‌కు కొడంగల్‌లో కూడా తిరగలేని పరిస్థితి వచ్చిందని చెప్పారు. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన లగచర్ల రైతులు ఎవరూ భయపడొద్దని.. మీకు మేము అండగా ఉంటామని ప్రకటించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Korutla MLA Padayatra: కేటీఆర్‌ యాత్రకు ముందే బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాదయాత్ర


కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌ కావడంతో హైదరాబాద్‌లోని అతడి కుటుంబసభ్యులను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యతో కలిసి కేటీఆర్ పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని నరేందర్‌ రెడ్డి మాతృమూర్తి, ఆయన భార్యకు భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని.. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌ రెడ్డి దుర్మార్గ పాలనపై కేటీఆర్‌ మండిపడ్డారు.


Also Read: Revanth Reddy Scam: ఢిల్లీలో బాంబు పేల్చిన కేటీఆర్‌.. రేవంత్ రెడ్డి అవినీతి బట్టబయలు


లగచర్లలో అరెస్ట్ చేసిన పేద రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని.. తాము లగచర్లకు వెళ్తామని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తూ నికృష్ట పరిస్థితిని తీసుకొచ్చారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణను కూడా వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని చెప్పారు. కానీ వార్డు సభ్యుడు కూడా కాని రేవంత్‌ రెడ్డి అన్న తిరుపతి రెడ్డిని మాత్రం లగచర్లకు 300 మందితో ఎలా వెళ్లనిచ్చారని ప్రశ్నించారు.


రేవంత్ అన్న స్వైరవిహారం
లగచర్లలో తిరుపతి రెడ్డి తన అనుచరులతో స్వైర విహారం చేస్తూ ప్రజలను బెదిరింపులకు పాల్పడుతున్నారని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆరోపించారు. భూమిని కోల్పోతామని బాధపడుతున్న గిరిజన, దళిత, బీసీ రైతులను జైళ్లలో పెట్టి వాళ్లను కొడుతూ చిత్రహింసలు పెట్టిన నికృష్ట ప్రభుత్వం ఇది అని విమర్శించారు. ఒక ఇంట్లో మహిళ ఛాతిపై కాలితో తొక్కి ఆ మహిళ భర్తను అరెస్ట్ చేశారని వివరించారు. 'గతంలో ఏ నియంత.. అప్రజాస్వామిక పాలకుడు కూడా చేయని దుర్మార్గ వ్యవహారం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌‌లో చేస్తున్నాడు. ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటున్నామనే విషయాన్ని డీజీపీతోపాటు పోలీసులు గుర్తించాలి' హితవు పలికారు.


ఏపీలో పరిస్థితే!
'లగచర్లకు రేపు మేము కూడా వెళ్తాం. మమ్మల్ని కూడా అడ్డుకుంటారా? 144 సెక్షన్ ఉన్నా సరే 300 మందితో తిరుపతి రెడ్డి లగచర్లలోకి ఎందుకు అనుమతించారని డీజీపీని ప్రశ్నిస్తున్నా?' అంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నలు సంధించారు. 'ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అతి చేస్తే పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగిందో అదే జరుగుతుంది' జోష్యం చెప్పారు. రేవంత్ రెడ్డి భూదాహ యజ్ఞంలో అతి వేషాలు వేసి అధికారులు బలిపశువులు కాకండి అంటూ సూచించారు. రేవంత్ రెడ్డి అల్లుడి కోసం ఫార్మా కంపెనీ పేరిట పేదల భూములు గుంజుకోవటానికి చేస్తున్న ప్రహసనంలో మీరు బలి కావొద్దని హతవు పలికారు.


కమిషన్ లకు ఫిర్యాదు
లగచర్ల రైతులను కొట్టిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్టీ కమిషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తామని కేటీఆర్‌ ప్రకటించారు. రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే మనం ఇప్పుడు కూడా నోరు విప్పకపోతే చరిత్రహీనులవుతామని పేర్కొన్నారు. బీజేపీ, కమ్యూనిస్టులు సహా అన్ని పార్టీలు స్పందించాలని పిలుపునిచ్చారు. లేకపోతే ప్రజాస్వామిక తెలంగాణలో స్వేచ్ఛ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాటిందని గుర్తుచేశారు. ఢిల్లీ వాళ్లకు ఎప్పుడు కోసం వస్తే అప్పుడు ఆయన పదవి ఊడిపోతుందన్నారు.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి