దూరమైన నందమూరి ఫ్యామిలీని క్రమ క్రమంగా టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ దగ్గరకు తీసుకుంటున్నారు. బాలకృష్ణను వియ్యంకుడిగా చేసుకొని ఆయన్ను పార్టీలో ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు..తాజాగా హరికృష్ణ కూమార్తె సుహాసినికి టీడీపీ టికెట్ కేటాయించి మరింత దగ్గర కావాలనుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని కూకట్పల్లి టికెట్ ఆమెకు కేటాయించేందుకు రంగం సిద్ధం చేసిన్నారు.. ఆ స్థానానికి ఆమె పేరు ఖారారు చేసినట్లు వార్తలు వినిపిస్తన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రబాబుతో సుహాసిని భేటీ 
ప్రముఖ మీడియా కథనం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం సుహాసిని విశాఖలోని ఓ హోటల్ లో ఏపీ సీఎం చంద్రబాబును కలుసుకున్నారు. ఈ సందర్భంగా  20 నిమిషాల పాటు ఇరువురి మధ్య చర్చ జరిగిందని...సుహాసిని ఆసక్తి చూపడంతో కూకట్‌పల్లి టికెట్ ను ఆమెను ఖారు చేసినట్లు తెలిసింది. వాస్తవానికి మహాకూటమిలో కూకట్ పల్లి ఇంకా ఎవరికీ కేటాయించనప్పటికీ .. దీన్ని టీడీపీ కేటాయించేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఈ సీటును సుహాసినికి  ఖరారు చేసినట్లు తెలిసింది.


పెద్దిరెడ్డిని పక్కన పెట్టినట్లేనా ? 


తొలుత ఈ టికెట్ ను తెలంగాణ టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డికి కేటాయించాలని టీడీపీ భావించింది.. హరికృష్ణ కుాతురు సుహాసిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చడంతో అకస్మాత్తుగా ఆమెకు కూకట్ పల్లి టికెట్ ఆఫర్ చేశారు. దీనికి ఆమె అంగీకరించడంతో ఈ మేరకు టికెట్ ఖారారు చేసినట్లు తెలిసింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.