తెలంగాణ ఎన్నికలు: లగడపాటి జోస్యంలో ఆసక్తికర విషయాలు
సరిగ్గా పోలింగ్ కి రెండు రోజుల ముదు ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి తన సర్వేకు సంబంధించిన పలు కీలక వివరాలను బయటపెట్టారు.
కాదు కాదంటూనే లగడపాటి నోట సర్వే ఫలితాల మాట వినిపించింది. ఎన్నికల సర్వే ఫలితాలకు సంబంధించిన పలు అంశాలను ఆయన బటపెట్టారు. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. మహాకూటమికి అనుకూలం వాతావరణం ఉందని తేల్చారు. ప్రజా నాడి హస్తవైవే ఉంటుందని లగడపాటి తెలిపారు. అయితే ఓట్ల శాతం ఆధారంగా ఫలితాలు మారొచ్చని హెచ్చరించారు. ఓట్ల శాతం పెరిగితే అధికార పార్టీకి వ్యతిరేక పెరగవచ్చు అభిప్రాయపడ్డారు. ఒక ఓటింగ్ వేళ శాతం అనుహ్యంగా పడిపోతే హంగ్ వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో 1000 నుంచి 2000 శ్యాంపిల్స్ తీసుకొని శాస్త్రీయ పద్దతితో తాను సర్వే నిర్వహించానని..సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలు పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు వెల్లడిస్తానని పేర్కొన్నారు. సర్వే పూర్తి వివరాల్లో ఎవరి ఎన్నిసీట్లు వస్తాయో చెబుతానని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల గెలుపోటముల గురించి తర్వాత చెబుతానని లగడపాటి పేర్కొన్నారు
లగడపాటి సర్వేలోని ముఖ్యాంశాలు:
* మహాకూటమికి అనుకూలం వాతావరణం
* ప్రజా నాడి హస్తవైవే ఉంటుందంటున్న ఆక్టోపస్
* ఓట్ల శాతం ఆధారంగా ఫలితాలు మారొచ్చని వార్నింగ్
* ఓట్ల శాతం పెరిగితే అధికార పార్టీకి వ్యతిరేకత
* ఓటింగ్ శాతం అనుహ్యంగా పడిపోతే హంగ్ వచ్చే ఛాన్స్
* ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో మహాకూటమిదే పై చేయి
* వరంగంల్, నిజామాబాద్, మెదక్ లలో టీఆర్ఎస్ ఆధిక్యం
* కరీంనగర్ మహబూబ్ నగర్ లో హోరా హోరీ పోరు
* హైదరాబాద్ లో అత్యధిక స్థానాల్లో ఎంఐఎం గెలుచుకుంటుంది
* మిగిలిన వాటిని బీజేపీ, ప్రజాకూటమి, టీఆర్ఎష్ లు పంచుకుంటాయి
* గత ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా బీజేపీ సీట్లు పెరుతాయి
* హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లోని కొన్ని స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది
* ఆరుగురు స్వంత్రం అభ్యర్ధులు గెలుపు