Khairatabad Ganesh 2024 Nimajjanam Live: మళ్లీ రావయ్య.. గణపయ్య.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణనాథుడు..

Tue, 17 Sep 2024-2:08 pm,

Khairatabad Ganesh Immersion Live Updates: గణేష్ నిమజ్జనానికి గ్రేటర్ హైదరాబాద్ సిద్ధమైంది. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర, బాలాపూర్ లడ్డూ వేలంపాట కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గణనాథుడి నిమజ్జనం లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Khairatabad Ganesh Immersion Live Updates: బొజ్జ గణపయ్య నేడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. 11 రోజులపాటు మండపాల్లో విశిష్ట పూజలు అందుకున్న లంబోదరుడిని నిమజ్జనానికి హైదరాబాద్ మహానగరం సిద్ధమైంది. ఖైరతాబాద్ గణేష్‌ నిమజ్జనానికి సంబంధించి ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. వేలాది విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు క్యూకట్టాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని చెరువులు, కొలనుల్లో గణనాథున్ని నిమజ్జనం చేయనున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 25 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర.. బాలాపూర్ లడ్డూ వేలంపాటపై అందరీ కళ్లు నెలకొన్నాయి. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
 

Latest Updates

  • Khairatabad Ganesh 2024 Nimajjanam Live Updates: ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ముగిసింది. క్రేన్ 4 వద్ద బడా గణేశుడి నిమజ్జనం పూర్తయింది. 

  • Khairatabad Ganesh 2024 Nimajjanam Live Updates: ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్యాంక్‌బండ్ జనసంద్రంగా మారింది. క్రేన్ 4 వద్ద బడా గణేశుడి నిమజ్జనం జరగనుంది.

  • Khairatabad Ganesh 2024 Nimajjanam Live Updates: బాలాపూర్‌ లడ్డూ తమ కుటుంబానికి దక్కడం ఇది తొమ్మిదోసారి అని అని కొలను శంకర్‌రెడ్డి తెలిపారు. ఈ లడ్డూను ప్రధాని మోదీకి అంకితం ఇస్తున్నానని అన్నారు.

  • Khairatabad Ganesh 2024 Nimajjanam Live Updates: సీఎం రేవంత్ రెడ్డి హుస్సేన్‌ సాగర్ వద్దకు చేరుకున్నారు. గణనాథుని నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.

  • Balapur Ganesh Laddu Auction Latest Updates: బాలాపూర్ లడ్డూకు వేలంలో రికార్డు ధర దక్కింది. రూ.30 లక్షల ఒక వేయికి కొలన్ శంకర్ రెడ్డి దక్కించుకున్నారు.

  • Balapur Ganesh Laddu Auction Latest Updates: బాలాపూర్ లడ్డూ వేలానికి ఈసారి కొత్త నిబంధనలు పెట్టారు. గత ఏడాది లడ్డూ ధర రూ.27 లక్షలు డిపాజిట్ చేసి వేలంలో పాల్గొనాలని నిర్వాహకులు కండీషన్ పెట్టారు. దీంతో ఈసారి ఐదుగురి మధ్యే పోటీ నెలకొన్నట్లు సమాచారం.

  • Khairatabad Ganesh 2024 Nimajjanam Live: ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య శోభాయాత్ర టెలిఫోన్ భవన్‌ వద్ద కొనసాగుతోంది. 

  • Ganesh Laddu Auction Live: రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో వేలంలో గణేష్‌ లడ్డూ రూ.కోటి 87 లక్షలు ధర పలికింది.

  • Khairatabad Ganesh 2024 Nimajjanam Live: ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయం రూ.70 లక్షల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటనల రూపంలో మరో రూ.40 లక్షలు సమకూరినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • Khairatabad Ganesh 2024 Nimajjanam Live: ఖైరతాబాద్ గణేశ్‌ శోభాయాత్ర కొనసాగుతోంది. మధ్యాహ్నం 12.30 గంటలకల్లా ట్యాంక్‌బండ్‌కు చేరుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 

  • Ganesh 2024 Nimajjanam Live Updates: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గణేశ నిమజ్జనం కొనసాగుతోంది. నగరంలో 21 నిమజ్జనం కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4,600 విగ్రహాలు నిమజ్జనం చేయనున్నారు. విశేష పూజలు నిర్వహించుకొని విగ్రహాలు హన్మకొండలోని బంధం చెరువు వద్ద కు చేరుకుంటున్నాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

  • Khairatabad Ganesh 2024 Nimajjanam Live: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మహా గణపతి నిమజ్జన షెడ్యూల్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
     

  • Balapur Ganesh Laddu Auction Live: అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలాపూర్ లడ్డూ వేలం ఉదయం 9.30 గంటలకు ప్రారంభంకానుంది.

  • Khairatabad Ganesh Immersion Live: ఖైరతాబాద్ సప్తముఖ మహా శక్తి గణపతి శోభాయాత్ర ప్రారంభం..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> మహాగణపతి శోభాయాత్రకు భారీగా తరలివచ్చిన భక్తులు..

    ==> పోలీసుల భారీ బందోబస్తు..

  • Khairatabad Ganesh Immersion Live: ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. గంగమ్మ ఒడికి చేరేందుకు గణనాథుడు బయల్దేరాడు. మధ్యాహ్నం హుస్సేన్‌సాగర్‌లో లంబోదరుడిని నిమజ్జనం చేయనున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link