Loksabha Election 2024: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలను అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటినట్లే.. లోక్‌సభ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లను సాధించాలని పట్టుదలతో ఉంది. అందుకే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. 17 స్థానాల్లో 14 పార్లమెంట్ సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా.. మూడు సీట్లను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. హైదరాబాద్‌ ఎంపీ స్థానంలో ఎంఐఎంతో పొత్తు ఉంటుందనే నేపథ్యంలో పెండింగ్‌లో పెట్టగా.. కరీంనగర్, ఖమ్మంలో పోటీ తీవ్రంగా ఉంది. అయితే తాజాగా ఈ మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పోటీ తీవ్రంగా ఉన్న ఖమ్మంతో పాటు కరీంనగర్, హైదరాబాద్ సీట్లకు అభ్యర్థులను హైకమాండ్ ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Patna Road Accident: మెట్రో పనుల్లో ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం  


ముఖ్యంగా ఖమ్మ సీటుపై ముందు నుంచి అందరికీ ఆసక్తి నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక సీటు మినహా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలవగా.. బీఆర్ఎస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా హస్తం గూటికి చేరిపోయారు. దీంతో ఈ ఖమ్మం పార్లమెంట్‌లో కచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ఆశావహులు పోటీపడుతున్నారు. ఈ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు పొంగులేటి, భట్టి, తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తుండడంతో తమ వర్గాలకే టికెట్ ఇవ్వాలంటూ సిఫార్సులు చేస్తున్నారు. తాజాగా ఖ‌మ్మం సీటుపై మంత్రి పొంగులేటి త‌న పంతం నెగ్గించుకున్న‌ట్లు తెలుస్తోంది. పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ ఖరారు అయినట్లు సమాచారం.


కరీంనగర్ అందరూ ఊహించినట్లే వెలిచాల రాజేంద‌ర్ రావుకు కేటాయించారని చెబుతున్నారు. ఆయనకు ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్ సపోర్ట్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పేరు తెరపైకి వచ్చినా.. పొన్నం ప్రభాకర్‌తో ఉన్న విభేదాల కారణంగా టికెట్ ఇవ్వలేదని అంటున్నారు. ఇక హైదరాబాద్ పార్లమెంట్‌ నుంచి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సమీర్‌కే ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి పోటీగా బీజేపీ నుంచి మాధవీ లత బరిలో ఉండడంతో ఈ స్థానంపై అందరీ కన్ను నెలకొంది. ఇక్కడ త్రిముఖ పోరు నెలకొనే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే టికెట్ దక్కించుకున్న నాయకులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఓటు తమకే వేయాలని.. ఆరు గ్యారంటీలను ప్రతి ఇంటికి చేరుస్తామని చెబుతున్నారు.  


Also Read: Beheading Case: 27 ఏళ్ల కేసుకు తెర, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధికి 18 నెలల జైలు శిక్ష,



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook