సీట్ల సర్దుబాటు అంశంపై మహాకూటమిలో సరికొత్త వివాదానికి దారి తీసేలా ఉంది. సీట్ల కేటాయింపు విషయంలో టీజేఎస్ పట్టుబడుతున్న విషయం తెలిసిందే.. గెలిచే ఆస్కారం ఉన్న స్థానాల్లో తమకు సీట్లు కేటాయించాలని ...15కి తగ్గకుండా సీట్ల కేటాయింపు ఉండాలని కాంగ్రెస్ కు డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. దీనికిపై స్పందించిన కాంగ్రెస్ టీజేఎస్ కు 11 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కూడా పలు మెలికలు పెట్టిందట. ప్రముఖ మీడియా కథనం ప్రకారం పలు స్థానాల్లో ఇరు పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని కాంగ్రెస్ తెలిపింది. అంటే టీజేఎస్ పోటీ చేసే స్థానాల్లో కూడా కాంగ్రెస్ తన అభ్యర్థులను బరిలోకి దించుతుందన్నమాట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాంగ్రెస్ తీరుపై కోదండరాం గుస్సా


సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ పెట్టిన షరతుకు టీజేఎస్ ససేమిరా అంటోంది. ఈ సందర్భంలో కాంగ్రెస్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనికి తోడు ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో తమకు సీట్లను కేటాయించకపోవడంపై కూడా ఆ పార్టీ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతే కాకుండా కాంగ్రెస్ ప్రతిపాదిత సీట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే సీట్లపై జనసమితి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో సీట్ల పంచాయితీ వ్యవహారం ఉత్కంఠత దారితీస్తోంది.