నామినేషన్ల గడువు ముగింపు దశకు వచ్చినప్పటికీ మహాకూటమిలో మాత్రం సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కికాలేదు. ఈ విషయంలో కూటమి పార్టీలు ఒకడుగు ముందుకు ..రెండు అడుగులు వెనక్కి వెళ్తున్నాయి. నామినేషన్ల గడువు ఇంకా మూడు రోజులే ఉండటంతో టికెట్ల పంపిణీ వ్యవహారం యుద్ధప్రాతిపదికన తేల్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. దీంతో టికెట్ల పంపిణీ వ్యవహారం క్లైమాక్స్ చేరినట్లయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీడీపీ, సీీపీఐ పార్టీలు సీట్ల విషయంలో సర్దదుకుపోయినప్పటికీ టీజేఎస్ మాత్రం తమకు 12 సీట్ల కావాల్సిందేనంటూ పట్టుబడుతోంది. ఇప్పటికే టీజేఎస్ కు 8 సీట్లు కేటాయించి.. జనగామ సీటును కోదండరాంకు ఇచ్చేందుకు హోల్డ్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇలా మొత్తం కలిపి తొమ్మిది సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ అయింది. ఈ తరుణంలో టీజేఎస్ తాము పోటీ చేసే 12 స్థానాలను ప్రకటించి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చింది.


కోదండారం ఇచ్చి ఝలక్ తో ఖంగుతిన్న కాంగ్రెస్  పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ..ఆయన్ను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడారు. ఈ సమావేశంలో తమకు మరో రెండు సీట్లయినా ఇవ్వాల్సిందేనని తెగేసి చెప్పి కోదండారం హైదరాబాద్ కు పయనమయ్యారు. టీజేఎస్ కు వ్యవహారం తేలిన తర్వాతే కాంగ్రెస్ ఫైనల్ జాబితా విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీజేఎస్ ఒత్తిడి తలొగ్గి సర్దుకుపోతుందా...లేదంటే ఆ పార్టీతో సమరానికి సైఅంటుందా అనే విషయం ఈ రోజు తేలిపోనుంది.