How To Get E-KYC Gas Distribution: తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారి వచ్చినప్పటి నుంచి శరవేగంగా దూసుకెళ్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల హమీలను అమలు చయడంలో దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌ రెడ్డి మహిళ్లల కోసం చేపట్టిన మహాలక్ష్మీ పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సులను అమలు చేశారు. అనంతరం మేనిఫెస్టోలో రూ.500కే వంట గ్యాస్ సిలిండర్‌ అందిస్తామని ప్రకటించారు. ఈ సబ్సిడీ సిలిండర్ అందాలంటే ఈ- కేవైసీ తప్పకుండ ఉండాలని ప్రచారం చేశారు. దీంతో చాలా మంది వినియోగదారులు వారి గ్యాస్ ఏజెన్సీలకు వద్ద భారీ క్యూలు కట్టారు. అయితే ఇప్పటివరకు రూ.500లకే సిలిండర్ పథకంపై ఎలాంటి ఆదేశాలు రాలేదని రాష్ట్ర ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీ ఆఫీసులకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ-కేవైసీ ఎలా పొందాలి అంటే..?


ఈ-కేవైసీని పొందాలనే వారు డెలివరీ బాయ్స్ దగ్గర దీని ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని ఓ ప్రకటన విడుదల చేశారు. దీని కోసం ఏజెన్సీ ఆఫీసుల దగ్గర క్యూలలో నిలబడి టైంను  వేస్ట్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని ఆదేశాలు చేసినట్లు చెప్పారు. డెలివరీ బాయ్స్ వద్ద ఉన్న ప్రత్యేక యాప్ ద్వారా కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని స్పష్టం చేశారు. యాప్‌ ద్వారా కేవైపీ ప్రక్రియలో సమస్య ఉంటే ఏజెన్సీ ఆఫీసులకు వెళ్లాలని తెలిపారు.


500 రూపాయిలకే సిలిండర్ పై ప్రభుత్వం కసరత్తు..


రూ. 500 కే గ్యాస్‌ సిలిండర్‌ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాలని పౌరసరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం  2 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఆ రెండు రకాల వారు ఎవరు అంటే ..? మొదట రేషన్‌ కార్డు గుర్తింపు ఉన్నవారు. రేషన్‌ కార్డు లేని లబ్ధిదారులను ఎంపిక చేయడం రెండోదిగా ప్రతిపాదించారు.


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 


2 రకాల ప్రతిపాదనలు ఎలా వర్తిస్తుంది...


తెలంగాణ రాష్ట్రం మొత్తంలో సుమారు కోటి ఇరువై లక్షల కనెక్షన్లు ఉన్నాయి. అందులో హెచ్‌పీసీఎల్‌ నుంచి 43.40 లక్షలు, ఐఓసీఎల్‌ నుంచి 47.97 లక్షలు, బీపీసీఎల్‌ నుంచి 29.04 లక్షల వినియోగదారులు ఉన్నారని తెలుస్తోంది. వీరిలో  52.80 లక్షల మంది మాత్రమే ప్రతి నెలా సిలిండర్ బుక్ చేసుకుంటున్నారు. 89.99 లక్షల మంది రేషన్ కార్డు ద్వారా గ్యాస్‌ పొందుతున్నారు. దీని ప్రకారం వీరు తొలి ప్రతిపాదనలకు అర్హులు అని అభిప్రాయపడుతున్నారు. 


రెండో ప్రతిపాదనకు లబ్ధి దారుల ఎంపికకు సమయం ఎక్కువ పడుతుంది మంత్రి ఉత్తమ్‌ కుమార్‌కి అధికారులు తెలిపారు. ప్రస్తుత పథకం కింద ఏడాదికి 6 గ్యాస్‌ సిలిండర్లు ఇస్తే దాదాపు రూ.2,225 కోట్ల భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంటుంది.


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి