Gang Rape in Dundigal: హైదరాబాద్ శివారులోని దుండిగల్‌లో దారుణం వెలుగుచూసింది. ఓ మహిళపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఓ బార్ షాప్ వెనక్కి ఆమెను బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశారు. మహిళపై అఘాయిత్యాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని షోలాపూర్‌కి చెందిన ఓ మహిళ (30) నాలుగు రోజుల క్రితం మేడ్చల్ జిల్లా దుండిగల్‌కి వచ్చింది. స్థానికంగా ఉండే నలుగురు వ్యక్తులు ఆమెపై కన్నేశారు. శుక్రవారం (ఏప్రిల్ 29) ఆమెకు మాయ మాటలు చెప్పి తమ వెంట తీసుకెళ్లారు. గండి మైసమ్మ ప్రాంతంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతంలోకి ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. అక్కడే ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.


అక్కడి స్థానికులు ఈ అఘాయిత్యాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను నరసింహ (23), ఉమృద్దీన్ (21), ఇమామ్ (20), కుద్దుస్ (21)గా గుర్తించారు. ఈ నలుగురు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బాధిత మహిళ బతుకుదెరువు కోసం మహారాష్ట్ర నుంచి దుండిగల్‌కు వచ్చినట్లు తెలిపారు. 


హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోనూ శుక్రవారం (ఏప్రిల్ 29) గ్యాంగ్ రేప్ ఘటన వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


Also Read : Funny Video: అసలే సమ్మర్, ఆపై విద్యుత్ కోతలు.. ఉక్కపోత తట్టుకోలేక ఈ వ్యక్తి ఏం చేశాడో చుడండి!


Also Read: Rahul Gandhi Meeting: ఓయూలో రాహుల్‌సభ- కీలక నిర్ణయం..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook