రంగారడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ డీసీఎం వ్యానును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.  మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మినీ డీసీఎం వ్యానును లారీ వేగంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. డీసీఎం వ్యానులో  ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.  మరో ఆరుగురు వ్యక్తులకు  తీవ్రగాయాలయ్యాయి. వారిని హుటాహుటిన  స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట నుంచి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారందరినీ కర్ణాటకవాసులుగా గుర్తించారు.


 [[{"fid":"183663","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


మా ఊరికి రావద్దు..!! 


లారీ వేగంగా ఢీకొట్టడంతో డీసీఎం  వ్యాను నుంచి ఓ వ్యక్తి బయట పడ్డాడు. రెండు వాహానాల మధ్య ఇరుక్కుని శరీరం ఛిద్రమై చనిపోయాడు. ఈ దృశ్యం స్థానికులను తీవ్రంగా  కలిచివేసింది. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణం అయి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..