హైదరాబాద్ : ప్రణయ్ హత్య కేసులో (Pranay murder case) ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతి రావు (Maruti Rao) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న ఆర్యవైశ భవన్‌లో ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించిన సంగతి తెలిసిందే. ప్రణయ్ పరువు హత్య ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో... మారుతి రావు ఆత్మహత్య (Maruti Rao suicide) కూడా అంతే చర్చనియాంశమైంది. కూతురును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో అల్లుడు ప్రణయ్‌ని హతమార్చిన మారుతి రావు ఆ తర్వాత అనేక ఆరోపణలు, అవమానాలు ఎదుర్కొన్నాడు. ఆరోపణలు మారుతి రావుకు ఆరోపణలు ఊహించనివి కాకపోయినా... అవమానాలు మాత్రం అతడిని ఒక్కచోట ప్రశాంతంగా ఉండనివ్వలేకపోయాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : తండ్రి మారుతీరావు ఆత్మహత్యపై స్పందించిన అమృత


 


అల్లుడిని హత్య చేసినా కూతురు భయపడకుండా ఎదుకు పోరాటం చేయడం.. తండ్రే కూతురి జీవితం నాశనం చేశాడని అందరూ తిట్టిపోయడం వంటి అవమానాల మధ్య ఆత్మహత్య చేసుకున్న మారుతి రావు తన సూసైడ్ నోట్‌లో చివరిసారిగా అమృత గురించే ఆవేదన వ్యక్తంచేయడం గమనార్హం. తల్లీ అమృత.. నువ్వు అమ్మదగ్గరికి వెళ్లిపో అంటూ కూతురు అమృత ప్రణయ్‌కి విజ్ఞప్తిచేశాడు. 


Read also : ప్రణయ్ హత్యకేసు: అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య


తన భర్త ప్రణయ్ హత్య తర్వాత ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లలేదు. తన భర్తను తనకు కాకుండా చేసిన ఆ కుటుంబంపై ఆమె కోపం పెంచుకున్నారు. అలా అప్పటి నుంచి ఇంటికి దూరమైన అమృత.. మరి తన తండ్రి మారుతి రావు చివరి కోరికను మన్నించి తల్లి వద్దకు వెళ్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..