Telangana Medico Died in Philippines: తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థి ఫిలిప్పీన్స్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మం రామలింగంపల్లికి చెందిన గూడురు మణికాంత్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మణికాంత్ రెడ్డి వయస్సు 21 ఏళ్లు. ఎనిమిది నెలల క్రితమే మెడిసిన్ చేసేందుకని గూడూరు మణికాంత్ రెడ్డి ఫిలిప్పీన్స్‌కి వెళ్ళాడు. రామలింగంపల్లికి చెందిన రామ్ రెడ్డి, రాధ దంపతులు కుమారుడే మణికాంత్ రెడ్డి. వైద్య విద్య పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వస్తాడనుకున్న తమ కుమారుడు మణికాంత్ రెడ్డి ఇక లేడని.. శాశ్వతంగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని తెలియడంతో మణికాంత్ రెడ్డి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెడిసిన్ కోసం ఫిలిప్పీన్స్ వెళ్లిన గూడురు మణికాంత్ రెడ్డి అక్కడ దవోవా మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ కాలేజ్ ఆవరణలోనే ఉన్న చెట్ల పొదల్లో మణికాంత్ స్థానికులకు విగత జీవిగా కనిపించాడు. చెట్లపొదల్లో మణికాంత్ రెడ్డి శవాన్ని చూసిన స్థానికులు అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది. అనంతరం మణికాంత్ రెడ్డి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. 


ఫిలిప్పిన్స్ నుంచి మణికాంత్ రెడ్డి తల్లిదండ్రులకు అందిన సమాచారం ప్రకారం అతడి మృతికి వారు రెండు రకాల వెర్షన్స్ చెబుతున్నారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి హాస్టల్ బిల్డింగ్ మెట్లు జారి డ్రైనేజ్ కాలువలో పడి చనిపోయాడని ఒక వెర్షన్ తెలుస్తుంటే.. బైక్‌పై నుంచి ప్రమాదవశాత్తుగా డ్రైనేజ్ కాలువలో పడి దుర్మరణం పాలయ్యాడని మరో వెర్షన్ చెప్పినట్టుగా తెలుస్తోంది. 


ఇది కూడా చదవండి : Komatireddy Raj Gopal Reddy: ఎమ్మెల్సీ కవిత‌తో కలిసి రేవంత్ రెడ్డి వ్యాపార లావాదేవీలు.. కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు


మణికాంత్ రెడ్డి మృతి దుర్వార్త అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. బతికి ఉండగా తమ కుమారుడిని చివరిచూపు చూసుకోలేకపోయామని.. కనీసం తమ కుమారుడి మృతదేహం అయినా త్వరగా ఇండియా చేరేలా చర్యలు వేగవంతం చేయాలని మణికాంత్ రెడ్డి కుటుంబసభ్యులు మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.


ఇది కూడా చదవండి : Teenmar Mallanna Exclusive Interview: తీన్మార్ మల్లన్న పార్టీ వెనుక ఎవరున్నారు ? తెలంగాణలో అసలేం జరుగుతోంది ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK