Minister Errabelli Dayakar Rao News: ఇంట్లో పని చేసే వాళ్లు ఉంటే.. వారికి భోజనం పెట్టి నెల నెల జీతం ఇస్తాం.. పండగలకు దుస్తులు కొనిస్తాం.. ఏదైనా కష్టం వస్తే సాయం చేస్తాం.. కానీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు మాత్రం మరో అడుగు ముందుకు వేశారు. తమ ఇంట్లో పని చేసే వారిని కుటుంబ సభ్యులకు కూడా తమ ఇంట్లో మనుషులుగా.. కుటుంబ సభ్యులుగా గుర్తించారు. వారి బాగోగులు చూసుకుంటూ.. వారి పిల్లల పెళ్లిళ్లు కూడా జరిపిస్తున్నారు. తాజాగా వంట మనిషి కుమార్తె పెళ్లిని తమ ఇంట్లోనే నిర్వహించి.. అతిథులు అందరికీ భోజనాలు పెట్టించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంత్రి ఎర్రబెల్లి ఇంట్లో గత 20 ఏళ్లుగా వంట మనిషిగా మల్లం కోమల పనిచేస్తోంది. ఆమె కుమార్తె శ్రీలేఖకు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన సుధాకర్‌తో వివాహం నిశ్చయమైంది. అయితే పెళ్లి నిర్వహణకు డబ్బు లేకపోవడంతో కోమల ఇబ్బంది పడింది. కోమల ఆర్థిక పరిస్థితి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు-ఉషా దంపతులకు తెలిసింది.


వెంటనే శ్రీలేఖ వివాహ ఖర్చులు భరించడమే కాక తమ స్వగ్రామం పర్వతగిరిలో తమ నివాసంలోనే స్వయంగా పెళ్లి జరిపించారు. అన్నీ తామే ఉండి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వివాహం జరిపించి.. నూతన జంటను ఆశీర్వదించారు. పెళ్లికి విచ్చేసిన అతిథులకు, రెండు కుటుంబాల బంధుమిత్రులకు భోజనాలు ఏర్పాటు చేసి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.


Also Read: 2000 Rupees Notes Update: మీ ఇంట్లో రూ.2 వేల నోటు ఉందా..? త్వరగా డిపాజిట్ చేయండి.. ఆర్‌బీఐ కీలక ప్రకటన  


తమ వంట మనిషి బిడ్డ పెళ్లిని తమ ఇంట్లో వివాహంలా జరిపించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులను బంధువులు అభినందించారు. ఈ సందర్భంగా మల్లం కోమల-రాజు దంపతులు తమ బిడ్డ పెండ్లిని జరిపించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులకు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.


Also Read: RBI Repo Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్‌బీఐ.. రెపో రేటుపై కీలక ప్రకటన  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి