2000 Rupees Notes Update: మీ ఇంట్లో రూ.2 వేల నోటు ఉందా..? త్వరగా డిపాజిట్ చేయండి.. ఆర్‌బీఐ కీలక ప్రకటన

RBI Governor Shaktikanta Das on 2000 Notes: రూ.2 వేల నోట్లు ఉపసంహరణ నిర్ణయం తరువాత ఇప్పటివరకు 50 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు వచ్చినట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. గడవు ముగిసే వరకు వేచి చూడొద్దని.. త్వరగా 2000 నోటును మార్చుకోవాలని సూచించారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jun 8, 2023, 07:18 PM IST
2000 Rupees Notes Update: మీ ఇంట్లో రూ.2 వేల నోటు ఉందా..? త్వరగా డిపాజిట్ చేయండి.. ఆర్‌బీఐ కీలక ప్రకటన

RBI Governor Shaktikanta Das on 2000 Notes: రూ.2 వేల నోట్లను రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ఉపసంహరించుకున్న తరువాత.. పెద్ద నోట్లను మార్పిడి చేసుకుంటున్నారు. ఇప్పటివరకు చెలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లు 50 శాతం తిరిగి వచ్చాయని ఆర్‌బీఐ గవర్నర్  శక్తికాంత దాస్‌ వెల్లడించారు. గురువారం ద్రవ్య సమీక్షా విధానాన్ని (ఎంపీసీ) ప్రకటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు 1.80 లక్షల కోట్ల రూపాయల విలువైన 2 వేల రూపాయల నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయన్నారు.  మార్చి నెల చివరి నాటికి మొత్తం రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయని చెప్పారు. మరో 50 శాతం నోట్లు వెనక్కి రావాల్సి ఉందన్నారు. 

రూ.2000 నోట్లలో 85 శాతం నేరుగా బ్యాంకు అకౌంట్లలోనే జమ చేసుకుంటున్నారని శక్తికాంత దాస్ తెలిపారు. తాము అంచనా వేసినట్లే నోట్లు వెనక్కి వస్తున్నాయని.. నోట్లను డిపాజిట్ చేసే సమయంలో ఎలాంటి హడావుడి, ఇబ్బందులు లేవన్నారు. 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి మరో 4 నెలల సమయం ఉందన్నారు. నోట్లను డిపాజిట్ చేయడానికి కంగారు పడాల్సిన అవసరం లేదని సూచించారు. 

రిజర్వ్ బ్యాంక్ వద్ద తగినంత కరెన్సీ నిల్వ ఉందని.. ప్రజలు సమయం తీసుకుని రూ.2 వేల నోట్లను మార్చుకోవాలని చెప్పారు. అయితే చివరి క్షణం వరకు వేచిచూడొద్దని.. గడువు ముగుస్తున్న సమయంలో పోటీ ఎక్కువగా ఉంటుందన్నారు. సెప్టెంబర్ చివరి 10 నుంచి 15 రోజులలో 2000 రూపాయల నోట్ల మార్పిడికి పోటీ మొదలయ్యే అవకాశం ఉంది.

Also Read: Rs 500 Notes, Rs 1000 Notes: రూ. 500 నోట్ల రద్దు, రూ. 1000 నోట్ల రీ ఎంట్రీపై ఆర్బీఐ గవర్నర్ క్లారిటీ

ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీలో 2 వేల నోటు వాటా కేవలం 10.8 శాతం మాత్రమేని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరతను భర్తీ చేసేందుకు రూ.2000 నోటును తీసుకొచ్చామన్నారు. రూ.2000 నోటు ఎవరి వద్ద ఉంటే.. వారి బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవచ్చని లేదా బ్యాంకుల్లో నోటుతో మార్చుకోవచ్చన్నారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు సమయం ఉండడంతో వంద శాతం నోట్లు తిరిగి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.500 నోట్లను ఉపసంహరించుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అదేదవిధంగా రూ.1,000 నోటును మళ్లీ ప్రారంభిస్తారనే ప్రచారంపై స్పందించారు. ఇలాంటి ఊహాగానాలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. 

Also Read: RBI Repo Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్‌బీఐ.. రెపో రేటుపై కీలక ప్రకటన  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News