హైదరాబాద్: అసలే.. 'కరోనా వైరస్'.. ఆపై లాక్ డౌన్.. ఈ క్రమంలో వలస కూలీలు ఆగమాగమైపోతున్నారు. బతుకుదెరువు కోసం జన్మనిచ్చిన ఊరును వదిలి.. పొట్ట చేతపట్టుకుని రాష్ట్రాలకు రాష్ట్రాలు దాటి వచ్చేశారు. ఇప్పుడు కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా.. బతుకుదెరువు లేక.. బతికే మార్గం తెలియక.. మళ్లీ సొంతూళ్లకు తిరిగి వెళ్తున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా ఎలాంటి వాహన సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో.. దిక్కు తోచని స్థితిలో కాలినడకనే తమ మార్గంగా ఎంచుకుంటున్నారు. అలాగే 10 మంది కుటుంబసభ్యులతో ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణఖేడ్ నుంచి రామాయంపేట మీదుగా వెళ్తున్న ఓ కుటుంబానికి మార్గమధ్యంలో అనుకోని కష్టం ఎదురైంది. వారి కుటుంబ సభ్యుల్లో ఒకరైన గర్భిణీ సుస్మితకు వైద్య సౌకర్యం అవసరమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : బ్రేకింగ్: ఏపీలో తాజాగా 80 కరోనా కేసులు, ముగ్గురి మృతి


ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు.. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. గురువారం ఉదయం మంత్రి హరీష్ రావు.. సుస్మితను పరామర్శించారు. ఈ క్రమంలో సుస్మిత తన ఆవేదనను మంత్రికి వివరించింది. దీనిపై చలించిపోయిన మంత్రి హరీష్ రావు.. లాక్ డౌన్ పూర్తయ్యాక తన వాహనం ఇచ్చి వారిని మధ్యప్రదేశ్ పంపిస్తానని హామీ ఇచ్చారు. అప్పటి వరకు అన్నం పెట్టి  జీవనోపాధి కల్పిస్తామని తెలిపారు. లాక్ డౌన్ పూర్తయ్యేంత వరకు ఎక్కడికి వెళ్లొద్దని మాకు సహకరించాలని మంత్రి హరీష్ రావు వారిని కోరారు. అంతే కాకుండా వారికేవైనా అవసరాలు ఉంటే తనను సంప్రదించాలంటూ ఫోన్ నంబర్ ఇచ్చారు. 


Also read : SBI నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ మరిచిపోయారా.. ఇలా చేయండి


రాష్ట్రేతరులకు కూడా నిత్యావసర సరుకులు, షెల్టర్ ఇవ్వడంతో పాటు, వారి ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ వారికి అండగా ఉంటామని మంత్రి హరీష్ రావు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..