బ్రేకింగ్: ఏపీలో తాజాగా 80 కరోనా కేసులు, ముగ్గురి మృతి

ఏపీలో రోజురోజుకూ కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో నిర్వహించిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదయ్యాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 23, 2020, 04:42 PM IST
బ్రేకింగ్: ఏపీలో తాజాగా 80 కరోనా కేసులు, ముగ్గురి మృతి

కరోనా తీవ్రత ఎక్కవగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఏపీలో రోజురోజుకూ కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో నిర్వహించిన టెస్టుల్లో తాజాగా 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా మహమ్మారి కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 893కి చేరుకోగా, 27 మంది మరణించారు. ప్రస్తుతం 725 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.  ‘జబర్ధస్త్’ ఫొటో వదిలిన యాంకర్ అనసూయ.. చూస్తే షాక్!

Image Credit: twitter/@ArogyaAndhra

Photos: లేటు వయసులో బికినీ అందాలు

ఈ వివరాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. తాజాగా కృష్ణా జిల్లాలో ఒకరు చనిపోగా, కర్నూలు జిల్లాలో రెండు మరణాలు సంభవించాయి. చికిత్స అనంతరం మొత్తంగా కోలుకుని ఇప్పటివరకూ 141 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. గత వారం రోజుల్లో కరోనా కేసులు ఒక్కరోజు నమోదు కావడం ఇదే అత్యధికం. SBI నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ మరిచిపోయారా.. ఇలా చేయండి

జిల్లాలవారీగా చూస్తే 234 పాజిటివ్ కేసులతో కర్నూలు, 195 కరోనా కేసులతో గుంటూరు జిల్లాల్లో కరోనా మహమ్మారి తీవ్రత అధికంగా ఉంది. కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.     జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

Trending News