1400 Posts Recruitment Notification Shortly: హైదరాబాద్: పేట్లబుర్జులోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు.. ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో డాక్టర్ల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు పేషెంట్స్‌తో వ్యవహరిస్తున్న తీరు గురించి, వారిలో రావాల్సిన మార్పు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్పత్రుల్లో అన్ని మౌళిక వసతులు కల్పిస్తున్నామని.. అయినప్పటికీ విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యం, పేషెంట్స్‌తో కొంతమంది సిబ్బంది వ్యవహరించే దురుసు ప్రవర్తన వల్ల మొత్తం ఆస్పత్రులకే చెడ్డ పేరు వస్తోందని నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిని మందలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చే వారి పట్ల మానవత్వంతో స్పందించి సకాలంలో వారికి వైద్య సహాయం అందిస్తే గర్భిణులు, శిశు మరణాలు తగ్గించవచ్చని సూచించారు. అవసరం అయతే తప్పించి అనవసరంగా రిఫరెన్సులు మానుకోవాలని సిబ్బందికి సూచించారు. అలా చేయడం వల్ల పేషెంట్స్ అయోమయానికి గురై మధ్యలో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడం లేదా అక్కడ, ఇక్కడ పరుగెత్తే క్రమంలో సకాలంలో వైద్యం అందక తల్లి, బిడ్డ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోందని అన్నారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఉదంతంలో రిపీటెడ్ రిఫరెన్సుల వల్ల సకాలంలో వైద్యం అందక తల్లీబిడ్డ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు.


టిఫా స్కాన్ ఎందుకు చేయడం లేదు
కొన్ని ఆస్పత్రుల్లో టిఫా స్కానింగ్ మెషినరి ఇచ్చినప్పటికీ.. వారు ఆ మెషినరిని ఉపయోగించడం లేదని తేలింది. ఏయే ఆస్పత్రుల్లో మెషిన్స్ ఎన్ని టిఫా స్కాన్స్ చేశారని తాను డీటేల్స్ తెప్పించుకుంటున్నానని.. వారు టిఫా స్కాన్స్ ఎందుకు చేయడం లేదో డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ రిపోర్ట్ తెప్పించుకోవాలని డిఎంహెచ్ఓలను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఒకవేళ ఏదైనా ఆస్పత్రిలో రేడియాలజిస్ట్ లేకపోతే.. అక్కడ ఉన్న గైనకాలజిస్టులకు శిక్షణ ఇచ్చామని.. అయినప్పటికీ వారు టిఫా స్కానింగ్ ఎందుకు ఉపయోగించడం లేదో అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే ఆస్పత్రుల్లో ఉన్న ఖాళీలు, సిబ్బందికి శిక్షణ వంటి అంశాల గురించి స్పందిస్తూ.. త్వరలోనే ఆస్పత్రుల్లో 1400 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులను భర్తీ చేయనున్నామని అన్నారు. 


కష్టపడిన వారికి రివార్డ్స్.. విధుల్లో నిర్లక్ష్యం చూపిస్తే పనిష్మెంట్..
ఆస్పత్రికి వచ్చిన పేషెంట్స్ పట్ల మానవత్వంతో స్పందించి వైద్య సహాయం అందించే వారిని గుర్తించి ఎలాగైతే రివార్డ్స్ ఇస్తున్నామో.. అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించే వారికి కూడా తగిన పనిష్మెంట్స్ ఉంటాయని.. విధుల్లో నిర్లక్ష్యాన్ని అస్సలు ఉపేక్షించేది లేదని మంత్రి హరీష్ రావు స్పష్టంచేశారు. 



 


అంతా సూపరిండెంట్స్ చేతుల్లోనే ఉంది..
ఆస్పత్రుల్లో మౌళిక వసతులు కల్పించే స్వేచ్ఛ ఆస్పత్రి సూపరింటెండ్‌కి ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. తాను ఆస్పత్రులకు అందుబాటులో ఉన్న నిధులను ఆడిట్ చేసినప్పుడు  ఒక్కో ఆస్పత్రికి కనీసం రూ. 30 లక్షల నుంచి రూ. 2 కోట్లు, రూ3 కోట్లు వరకు నిధులు ఉన్నట్టు తేలిందని మంత్రి హరీష్ రావు స్పష్టంచేశారు. ఆ నిధులను ఖర్చుపెట్టే పూర్తి స్వేచ్ఛ కూడా ఆస్పత్రి సూపరింటెండెంట్స్‌కి ఉందని.. వారు మానవత్వంతో స్పందించి ఆస్పత్రిలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.


ఇది కూడా చదవండి : TSPSC Notifications: నిరుద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. మరో 4 నోటిఫికేషన్లు రిలీజ్ చేసిన టీఎస్పీఎస్సీ..


ఇది కూడా చదవండి : TSPSC Group 4 Notification: 9168 గ్రూప్‌-4 పోస్టులు.. వచ్చిన దరఖాస్తులు 8.47లక్షలు! మరోసారి గడువు పొడిగింపు


ఇది కూడా చదవండి : Minister Harish Rao: ఏపీ నుంచి రూ.495 కోట్లు ఇప్పించండి.. కేంద్రమంత్రికి హరీష్ రావు లేఖ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook