Double BedRoom Houses in Hyderabad | హైదరాబాద్‌ ప్రజలకు తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ దసరా కానుక అందజేశారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని జియాగూడలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు మంత్రి కేటీఆర్‌  (TS Minister KTR) ప్రారంభించారు. జియాగూడకు మంత్రి కేటీఆర్‌ రాగా.. స్థానిక మహిళు బోనాలతో కేటీఆర్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా.. జియాగూడలో 588 ఇళ్లను లబ్దిదారులకు కేటీఆర్‌ కేటాయించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను (Double Bedroom Homes) దసరా కానుకగా నేడు ప్రకటించారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


జియాగూడలో ప్రభుత్వం మొత్తం 840 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను నిర్మించింది. తొలి ప్రాధాన్యత ఇళ్లను నేడు కేటాయించారు. అనంతరం జియాగూడలో నిర్మించిన బస్తీ దవాఖానాను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. గత ప్రభుత్వాలు డబ్బా, అగ్గిపెట్టేలాంటి ఇండ్లు కట్టించేవని ఎద్దేవా చేశారు. ఆ డబ్బా ఇళ్ల పనులలోనూ అవినీతి చేసేవారని పేర్కొన్నారు. కానీ తమ ప్రభుత్వం మాత్రం మంచి నాణ్యత కల ఇళ్లను నిర్మించి ఇచ్చిందన్నారు. హైదరాబాద్‌లో మొత్తం 2 లక్షల మేర ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు.



 


గత ప్రభుత్వాలకు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు మంత్రి కేటీఆర్‌. ‘నేనే ఇళ్లు కట్టిస్తా.. పెళ్లి కూడా నేనే చేపిస్తా’ అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొనియాడారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా రూ.9 లక్షల భారీ వ్యయంతో లబ్దిదారులకు ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని పేర్కొన్నారు. జియాగూడలో బస్తీ దవాఖానాను సైతం ఏర్పాట్లు చేసి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని మంత్రి కేటీఆర్‌ అన్నారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe