Minister KTR: కాంగ్రెస్‌లో మంత్రి పదవుల పంపకం.. జానారెడ్డి సీఎం: కేటీఆర్ సెటైర్లు
BRS Meeting in Uppal Constituency: కాంగ్రెస్‌లో అప్పుడే మంత్రి పదవుల పంపకం మొదలైందని.. జానా రెడ్డి తానే సీఎం అంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. గత ఎన్నికల ముందు కూడా ఇలానే అన్నారని.. కానీ తరువాత ఏమైందని అడిగారు. తెలంగాణ ఉద్యమంలో కనిపించని నేతలు.. ఇప్పుడు తాము సీఎం అంటూ వస్తున్నారని మండిపడ్డారు.
BRS Meeting in Uppal Constituency: ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మా రెడ్డి గెలిపించాలని మంత్రి కేటీఆర్ కోరారు. బూత్ స్థాయి కార్యకర్తలు బాగా పనిచేసి.. బీఆర్ఎస్ విజయానికి కృష్టి చేయాలని సూచించారు. గురువారం ఉప్పల్ నియోజకవర్గంలో మల్లాపూర్‌లోని వీఎన్ఆర్ గార్డెన్‌లో ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్షారెడ్డికి మద్దతుగా బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన నాడు తెలంగాణ ఏమైపోతుందో అని అనుమానం ఉండేదని.. కానీ ఇవాళ తెలంగాణ దేశానికి ఎంతో ఆదర్శంగా నిలిచిందని అన్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ హైదరాబాద్ వచ్చి.. తాను హైదరాబాద్‌లో ఉన్నానా లేక న్యూయార్క్‌లో ఉన్ననా అని చెప్పారని గుర్తు చేశారు.
"విశ్వనగరంగా హైదరాబాద్ ఎదుగుతుందని ప్రపంచ సంస్థలు చెబుతున్నాయి. పదేళ్ల కింద తెలంగాణ రాష్ట్రంలో చిమ్మాటి చీకట్లు. ఇదే చర్లపల్లి పరిశ్రమల ప్రతినిధులు ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు చేసేది. మంచి నీళ్లు లేక ఆనాడు మన హైదరాబాద్ అవ్వలు ఎంతో ఇబ్బందులు పడ్డారు. ఆనాడు మెట్రో పనులు చేసుకోలేని పరిస్థితి. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తున్నాం.. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా నే సాధ్యమైంది. మళ్ళీ అధికారంలోకి వస్తే 24 గంటల మంచి నీళ్ళు ఇచ్చుకోవాలి.
ఆంధ్ర-తెలంగాణ పంచాయతీ లేదు. కర్ఫ్యూ లేదు. ముస్లిం, హిందూ గొడవలు లేవు. ఉప్పల్ మినీ ఇండియాగా పేరు ఉంది. ఎన్నో రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. నిన్న రాహుల్ గాంధీ వచ్చి కూడా ఏదేదో మాట్లాడుతున్నాడు. దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా అని మాట్లాడుతున్నాడు. ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు మధ్య ఈ ఎన్నికలు. ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి ఇష్టం లేని లగ్గం చేసి ఆంధ్రలో కలిపారు. ఇలా కలిపింది ఆయన ముత్తతా జవహర్ లాల్ నెహ్రూ. ఆనాడు ఎంతో మంది ప్రాణాలు తీసింది విల్లా తాత కదా..? మళ్లీ మర్లపడితే రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరా గాంధీ మన పిల్లలను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపారు అదే ఈ ఢిల్లీ దొరలు కాదా..? ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం.." అని మంత్రి కేటీఆర్ అన్నారు.
కేసీఆర్ స్థాయి ఎంత .. చిల్లర గాడు రేవంత్ రెడ్డి స్థాయి ఎంత..? అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కేటీఆర్. కాంగ్రెస్‌లో అప్పుడే మంత్రి పదవులు పంపకం అంటున్నారని.. జానా రెడ్డి తానే సీఎం అంటున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో కూడా గెలిచిపోయామన్నారు అన్నారని.. కానీ ఏమైందో అందరికీ తెలుసన్నారు. ఆనాడు ఉద్యమంలో రాని వారు ఇవాళ తామే సీఎం.. తామే సీఎం అని వస్తున్నారని మండిపడ్డారు. పాత సీసాలో కొత్త సారా తప్ప ఏం లేదని ఎద్దేవా చేశారు.
Also Read: Jee Main 2024 Registration: జీ మెయిన్ 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, దరఖాస్తు ఎలా
Also Read: Varun Tej Lavanya Tripathi Wedding: వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి ఫొటోలు.. నెట్టింట వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.