Varun Tej Lavanya Tripathi Wedding: వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి ఫొటోలు.. నెట్టింట వైరల్

Varun Tej Lavanya Tripathi Marriage Pics: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహ వేడక ఘనంగా జరిగింది. బుధవారం ఇటలీలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం వరుణ్ తేజ్ తన పెళ్లి ఫొటోలను షేర్ చేశాడు. "మై లవ్" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
 

  • Nov 02, 2023, 12:51 PM IST
1 /6

కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.  

2 /6

మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో మొదటిసారి కలుసుకోగా.. ఆ పరిచయం ప్రేమగా మారింది.  

3 /6

మెగాస్టార్ చిరంజీవి నూతన జంట పెళ్లి ఫొటోను సోషల్ మీడియా పోస్ట్ చేశారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.   

4 /6

వరుణ్ తేజ్ తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో కొత్త జంట ఫోటోను పంచుకున్నారు. "కొత్తగా పెళ్లైన జంట వరుణ్ తేజ్ కొణిదెల, లావణ్య కొణిదెల కోసం మా ఆశీర్వాదాలు." అని రాసుకొచ్చారు.  

5 /6

వధువు లావణ్య త్రిపాఠి ఎరుపు రంగు దుస్తులు ధరించగా.. వరుణ్ లేత గోధుమరంగు దుస్తుల్లో కనిపించాడు.  

6 /6

వరుణ్‌ తేజ్-లావణ్య త్రిపాఠి జంటకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. వీరి పెళ్లి ఫొటో నెట్టింట వైరల్ అవుతున్నాయి.