Hyderabad Metro: మెట్రోరైల్ ఫేస్ - 2 కారిడార్ DPR ఆమోదం కోసం కేంద్రమంత్రికి మంత్రి కేటీఆర్ లేఖ
Hyderabad Metro Second Phase DPR: కేంద్ర మంత్రికి రాసిన లేఖలో హైదరాబాద్ మెట్రోరైల్ కారిడార్ -2 ఆవశ్యకత గురించి మంత్రి కేటీఆర్ వివరించారు. శరవేగంగా పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా కారిడార్ -2 కింద మెట్రో రైల్ విస్తరణ జరగాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
Hyderabad Metro Second Phase DPR: హైదరాబాద్ మెట్రో అనతికాలంలోనే ఎంత ప్రజాధరణ పొందిందో అందరికీ తెలిసిందే. అయితే హైదరాబాద్ మెట్రో సంస్థను మరింత విస్తరింపచేసే ప్రణాళికల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.. హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణ పనులకు సంబంధించిన డిపిఆర్ కాపీపై ఆమోద ముద్ర వేయాల్సిందిగా కోరుతూ తాజాగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురికి లేఖ రాశారు. దేశంలోనే శరవేగంగా అభివృద్ది చెందుతున్న మెట్రో పాలిటన్ నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌లోని మెట్రో రైల్ ప్రాజెక్టు సెకండ్ ఫేజ్ కారిడార్ పనులను చేపట్టుటకు ఆమోదంతో పాటు బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలని కోరుతూ కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురికి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి రాసిన లేఖలో హైదరాబాద్ మెట్రోరైల్ కారిడార్ -2 ఆవశ్యకత గురించి మంత్రి కేటీఆర్ వివరించారు. శరవేగంగా పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా కారిడార్ -2 కింద మెట్రో రైల్ విస్తరణ జరగాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే మొదటి దశ కింద నడుస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్టు నగరానికే కలికితురాయిగా నిలిచిందని మంత్రి కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. మెట్రో రైల్ ఫస్ట్ ఫేస్ లో భాగంగా 69 కిలోమీటర్ల మెట్రో ప్రయాణం అందుబాటులోకి వచ్చి నగర రవాణా వ్యవస్థకు అండగా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ తన లేఖలో వివరించారు.
వీజీఎఫ్ స్కీమ్ (వయబుల్ గ్యాప్ ఫండింగ్ ) పీపీపీ పద్ధతిలో అమలు చేసిన హైదరాబాద్ మెట్రో రైల్వే లైన్ ఫేస్-1 ప్రాజెక్ట్ ప్రపంచంలో పెద్ద మెట్రో ప్రాజెక్టుగా గుర్తింపు పొందిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో రెండవ విడతలో భాగంగో మరో 31 కిలోమీటర్ల మెట్రో లైన్ మెట్రోరైల్ ప్రాజెక్టు – 2 కారిడార్ పనులకై ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. రెండో దశలో భాగంగా మొదటిది బీ హెచ్ ఇ ఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు 26 కిలో మీటర్ల మెట్రో లైన్ ని 23 స్టేషన్లతో కనెక్ట్ చేసే ప్రతిపాదన కాగా రెండోది నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5 కిలోమీటర్ల నిడివిలో 4 స్టేషన్లను కనెక్ట్ చేసే ప్రతిపాదనతో కూడిన డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేసినట్లు మంత్రి తనలేఖలో వెల్లడించారు.
కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టుటకుగాను రూ.8453 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు లేఖలో వివరించారు. ఈ DPR తో పాటు అందుకు సంబందించిన అన్ని డాకుమెంట్స్ ను రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ద్వారా అక్టోబర్ 22 న కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. అదేవిధంగా సెకండ్ ఫేస్ కు సంబందించిన ప్రతిపాదనల వివరాలు చర్చించడానికి కేంద్రమంత్రి అపాయింట్‌మెంట్‌ను మంత్రి కె. టి ఆర్ కోరారు. ముందస్తు సమాచారం కొరకు లేఖ ద్వారా వివరాలు తెలియ జేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎక్స్‌టర్నల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్‌తో అమలయ్యే ఈ ప్రాజెక్టుకు పాలనాపరమైన సూత్రప్రాయ అనుమతులు ఇవ్వాలని కోరారు. అలాగే హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు – 2 కారిడార్ ప్రతిపాదనలను 2022-23 బడ్జెట్ లో పేర్కొనాలని మంత్రి కేటీఆర్ ( Minister KTR ) కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.
Also Read : CM KCR: కేటీఆర్‌కు సీఎం పగ్గాలా..? అసెంబ్లీ రద్దా..? కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ
Also Read : PM Modi Speech: తెలంగాణ పర్యటనలో కేసీఆర్‌కి చురకలంటించిన ప్రధాని మోదీ.. డైరెక్టుగానే వార్నింగ్ ఇచ్చారా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook