KTR COMMENTS: ఎమ్మెల్యే బేరసారాలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR COMMENTS:ముగ్గురు నిందితుల రిమాండ్ ను కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును తిరస్కరించిన హైకోర్టు.. నిందితులను లొంగిపోవాలన ఆదేశించింది. అదే సమయంలో ఈ కేసులో బీజేపీ వేసిన పిటిషన్ పై మరో తీర్పు ఇచ్చింది. మునుగోడు ఉప ఎన్నిక ముగిసే వరకు పోలీసుల దర్యాప్తుపై స్టే విధించింది.

Written by - Srisailam | Last Updated : Oct 29, 2022, 02:57 PM IST
  • ఫాంహౌజ్ డీల్ కేసులో గంటకో ట్విస్ట్
  • మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
  • బండి సంజయ్ ప్రమాణాలపై సెటైర్లు
KTR COMMENTS: ఎమ్మెల్యే బేరసారాలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR COMMENTS: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కు ముందు వెలుగుచూసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. కోర్టుల్లో కూడా భిన్నమైన తీర్పులు వస్తున్నాయి. ముగ్గురు నిందితుల రిమాండ్ ను కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును తిరస్కరించిన హైకోర్టు.. నిందితులను లొంగిపోవాలని ఆదేశించింది. అదే సమయంలో ఈ కేసులో బీజేపీ వేసిన పిటిషన్ పై మరో తీర్పు ఇచ్చింది. మునుగోడు ఉప ఎన్నిక ముగిసే వరకు పోలీసుల దర్యాప్తుపై స్టే విధించింది. హైకోర్టు తీర్పుతో నవంబర్ 4 వరకు ఫాంహౌజ్ డీల్ కేసులో పోలీసుల దర్యాప్తు లేనట్టే.

తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా రాజకీయ సెగలు రేపుతున్న ఎమ్మెల్యే బేరసారాల అంశంపై స్పందించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.  ఫాంహౌజ్ డీల్ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని, చట్టం తన పని తాను చేసుకొని పోతోందని అన్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు తాము మాట్లాడబోమని చెప్పారు. ఈ విషయంలో సరైన సమయంలో సీఎం కేసీఆర్ స్పందిస్తారని చెప్పారు. యాదాద్రిలో బండి సంజయ్ చేసిన ప్రణాణంపైనా తనదైన శైలిలో స్పందించారు కేటీఆర్. ప్రమాణాలు.. ఇమానాలు బీజేపీ నేతలకు కామనే అన్నారు. రాజకీయ లబ్ది కోసం దేవుళ్లను మలికి చేయడం తమకు ఇష్టం లేదన్నారు కేటీఆర్. డీల్స్ కు సంబంధించి ఆడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నా ప్రమాణాలు చేసి చిల్లరగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ ని ఉద్దేశించి కామెంట్ చేశారు.

మునుగోడు బైపోల్ పైనా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.  మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉందన్నారు. గత ఎనిమిది ఏళ్లలో చేసిన అభివృద్ధిని చూపించి తాము ఓట్లు అడుగుతున్నామని చెప్పారు.తెలంగాణ కేంద్రం ఏం చేసిందో చెప్పి బీజేపీ ఓట్లు అడిగితే బాగుండేదన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో గతంలో ఎప్పుడు లేనంతగా అసాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపారు. చేనేతపై పన్ను విధించిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ అని విమర్శించారు. వ్యక్తిగత దూషణలు, విధ్వేషాలు తప్ప బీజేపీ చేసిందేమి లేదన్నారు. ఫ్లోరోసిస్ సమస్యను పట్టించుకోని బీజేపీ ప్రభుత్వంపైనే తమ మొదటి చార్జీషీట్ అన్నారు. చేనేతపై పన్ను వేయడాన్ని నిరసిస్తూ రెండో చార్జీషీట్, మోటార్లకు మీటార్లపై మూడో చార్జీషీట్, నీటి పంపకాల్లో తెలంగాణకు అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ నాలుగో చార్జిషీట్‌ను, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ ఐదో చార్జీషీట్‌ను మునుగోడు ప్రజల తరపున టీఆర్ఎస్ ప్రభుత్వం వేయబోతోందని స్పష్టం చేశారు. చరిత్రలో ఏ ప్రధాని చేయని తప్పు మోడీ చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణతో పాటు దేశ యువతకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ద్రోహం చేసిందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి ఇప్పటికీ లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. మోడీ హయాంలో గతంలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ భారీగా పతనమైందని విమర్శించారు. బేచో ఇండియా అంటూ ప్రభుత్వ రంగసంస్థల్ని క్లియరెన్స్ సేల్స్ చేస్తున్నారని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై నయవంచన చేస్తోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కార్పొరేట్లకు కానుకలు ఇస్తూ సామాన్యులపై పన్నుల భారం వేస్తూ పేదలకు చుక్కలు చూపిస్తోందని అన్నారు.

Also Read : MP Raghu Rama Krishnam Raju: ఆర్జీవీ 'వ్యూహం' మూవీకి కౌంటర్.. గండ్ర గడ్డలి, కోడి కత్తి సినిమా వస్తాయి: ఎంపీ రఘురామ   

Also Read : Poonam Kaur: రాహుల్ పప్పు కాదు.. భేటీ అనంతరం పూనమ్ ఆసక్తికర వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News