హైదరాబాద్: జీరో అవర్‌లో ( Zero hour ) మైకు ఇస్తే హీరోగిరీ చూపిస్తామంటే కుదరదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ ( Minister KTR vs MLA Komatireddy Rajagopal Reddy ) కౌంటర్ ఇచ్చారు. కొత్త మున్సిపాలిటీలకు బడ్జెట్ కేటాయింపులు జరగడం లేదని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. గురువారం నాడు జీరో అవర్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన మున్సిపాల్టీలలో జనసాంద్రత పెరుగుతున్నప్పటికీ.. అక్కడి మౌళిక సదుపాయాలకు తగినట్టుగా ప్రణాళికలు ఉండటం లేదు. అలాగే అభివృద్ధికి అవసరమైన బడ్జెట్ కేటాయించడం లేదు అని సభ దృష్టికి తీసుకొచ్చారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌, చండూరు మున్సిపాల్టీల్లో కనీస సౌకర్యాలు లేవు అని ఆరోపించారు. Also read : Antarvedi chariot fire case: అంతర్వేది రథం దగ్ధం కేసులో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీలలో సమస్యలను ఏకరువు పెట్టిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ( MLA Komatireddy Rajagopal Reddy ).. గజ్వేల్‌, సిరిసిల్ల, సిద్ధిపేట మున్సిపాల్టీలకు కేటాయించినట్టుగా తామేమీ వందల కోట్లు అడగట్లేదనీ, చౌటుప్పల్‌, చండూరుతో పాటు రాష్ట్రంలోని మిగతా అన్ని మున్సిపాల్టీలకు కనీస వసతుల కల్పించే విధంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. చౌటుప్పల్‌, చండూరు మున్సిపాలిటీలలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల వర్షపు నీరు, డ్రైనేజీ నీరు కలిసిపోయి రోడ్లపై నడవలేని దుస్థితి ఏర్పడిందని వివరించారు. అవసరమైతే మంత్రి కేటీఆర్‌ను కూడా తీసుకెళ్లి సమస్యను ప్రత్యక్షంగా చూపిస్తామని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. Also read : Gangavva funny dialogues: గంగవ్వ ఫన్నీ డైలాగ్స్ వింటే కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే


కోమటిరెడ్డి మాట్లాడిన అనంతరం ఆయన ఆరోపణలపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. చౌటుప్పల్‌, చండూరు మున్సిపాలిటీలకు నిధులు సమకూర్చడం లేదని ఆరోపించడం సరికాదని అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతీ నెలా మున్సిపాల్టీలకు రూ. 148 కోట్లు విడుదల చేస్తున్నామని చెబుతూ.. ఈ విషయాన్ని కోమటిరెడ్డి గుర్తించాలని సూచించారు. మున్సిపాలిటీలను ప్రభుత్వం అభివృద్ధి చేయనిదే మొన్న జరిగిన 130 మున్సిపాలిటీల ఎన్నికల్లో ( Municipal election ) 122 మున్సిపాలిటీల్లో జనం అధికార పార్టీని గెలిపించేవారా ? అని కోమటిరెడ్డిని నిలదీశారు. ఈ సందర్భంగా ఒకనొక దశలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై తీవ్ర అసహనం వ్యక్తంచేసిన మంత్రి కేటీఆర్.. జీరో అవర్‌లో మైక్‌ ఇచ్చినం కదా అని హీరో గిరి చేస్తామంటే నడవదని అభిప్రాయపడ్డారు. Also read : Chiranjeevi's tonsured head: చిరంజీవి గుండు లుక్ వెనుకున్న కథేంటి ?