GHMC Mayor elections: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల విషయంలో TRS party, MIM party మాట ఒక్కటేనని BJP ముందు నుంచి చెబుతున్న మాట నేడు జరిగిన మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎన్నికతో నిజమైందని బీజేపి కార్పోరేటర్స్ మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ మధ్య పొత్తు లేదని ఒకరిపై మరొకరు పరస్పరం ప్రత్యారోపణలు, దూషణలు చేసుకున్న ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు.. ఇవాళ ఎలా కలిసిపోయాయని BJP కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు.
Telangana New IT Policy: తెలంగాణలో నూతన ఐటీ పాలసీ రానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాలసీ ఐదేళ్లు పూర్తి కావస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని..మంత్రి కేటీఆర్ తెలిపారు.
Non-Agricultural properties registration | హైదరాబాద్: నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ తిరిగి ఊపందుకోనుంది. తెలంగాణలో డిసెంబర్ 11వ తేదీ నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ని ఆదేశించినట్టుగా మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా తెలిపారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం 10 నుంచి 12 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ కేవలం 200 నుంచి 300 మధ్య ఓట్ల తేడాతోనే ఓటమిపాలైందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో అంచనా వేసినట్టుగా మరో 20-25 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుస్తారని భావించినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.
Double Decker buses: గ్రేటర్ హైదరాబాద్ లో మరోసారి డబుల్ డెక్కర్ బస్సులు పరుగెట్టనున్నాయి. ఓ వ్యక్తి చేసిన ట్వీట్..మంత్రి కేటీఆర్ సూచనతో అధికారులు సిద్ధమయ్యారు. బస్సుల కొనుగోలుకు రవాణా శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ శనివారం జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బిజీబీజీగా గడిపారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలానగర్‌లో జరిగిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. నగరంలో ఆరేండ్ల కిందకు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి ఓటర్లకు వివరించి చెప్పే ప్రయత్నం చేశారు.
ట్విట్టర్ వేదికపై యాక్టివ్ గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. ఓ సభలో తన ఫోటో తీసిన చిన్నారిని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ కేటీఆర్ మనస్సు దోచుకున్న ఆ చిన్నారి ఎవరు..
హైదరాబాద్ పేరు మార్పిడిపై బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వస్తే..హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Minister KTR About Hyderabad Flood Relief Fund | హైదరరాబాద్ ప్రజలకు అండగా ఉన్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక్కరోజే లక్ష మందికి వరద సాయం పంపిణీ చేశామని, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే ఇంటికే వచ్చి సాయం అందిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
TS Minister KTR | భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. ఇదివరకే దుర్గం చెరువును సుందరీకరణ చేశారు. తాజాగా నగరంలో మరో స్టీల్ వంతెనను నిర్మించేందుకు టీఆర్ఎస్ సర్కార్ ఆమోదం తెలిపింది.
Double Bedroom Homes in Hyderabad | సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని జియాగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను () మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జియాగూడకు మంత్రి కేటీఆర్ రాగా.. స్థానిక మహిళు బోనాలతో కేటీఆర్‌కు స్వాగతం పలికారు. హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ దసరా కానుక అందజేశారు.
Minister KTR review meeting on rescue operations in Hyderabad: హైదరాబాద్: నగరంలో భారీ వర్షాలు, వరదలు కారణంగా నష్టపోయిన ప్రతీ కుటుంబానికి తక్షణమే తగిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు ( Minister KTR ) జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్‌లకు సూచించారు.
తెలంగాణ మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ (Telangana Minister KTR) కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) 2015 కింద గతంలో దరఖాస్తు చేసుకున్నవారు తాజాగా మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ((Applications under LRS 2015 to be disposed)) లేదన్నారు.
రెవెన్యూ చట్టంలో ( New Revenue Act 2020 ) మార్పులు చేర్పులకు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. ప్రస్తుతం నిలిపేసిన రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ మళ్లీ మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ( Congress MLA Jagga Reddy ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఎట్టకేలకు ఫ్లోరైడ్‌పై విజయం (Fluoride Problem In Telangana) సాధించిందని, దాని ప్రభావిత ప్రాంతాలు లేనే లేవని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మిషన్ భగీరథ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్లే ఫ్లోరోసిస్‌పై విజయం సాధించగలిగాం అన్నారు.
Revanth Reddy open letter to CM KCR: హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ ( Revanth Reddy to CM KCR ) ద్వారా ఘాటైన హెచ్చరికలు చేశారు. నాగులు ఆత్మహత్యాయత్నం ఘటనకు ( Nagulu suicide attempt issue ) దారితీసిన పరిస్థితులను ప్రస్తావిస్తూ సీఎం కేసీఆర్‌కు ఘాటైన పదజాలంతో బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి.
జీరో అవర్‌లో ( Zero hour ) మైకు ఇస్తే హీరోగిరీ చూపిస్తామంటే కుదరదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ ( Minister KTR vs MLA Komatireddy Rajagopal Reddy ) కౌంటర్ ఇచ్చారు. కొత్త మున్సిపాలిటీలకు బడ్జెట్ కేటాయింపులు జరగడం లేదని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ( Minister KTR ) సోమవారం ఢిల్లీలోని నిర్మల్ భవన్‌లో పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీని ( Union minister Hardeep Singh Puri ) కలిశారు. కేంద్ర మంత్రితో భేటి అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. తెలంగాణలో పట్టణాభివృద్ధి శాఖ, విమానయాన శాఖకు సంబంధించిన అభివృద్ధి పనులు, సమస్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.