Minister Malla Reddy vs Malipeddi Sudheer Reddy | మేడ్చల్: జిల్లాలో మంత్రి మల్లా రెడ్డి వర్గానికి, మలిపెద్ది సుధీర్ రెడ్డి వర్గానికి మధ్య ఉన్న విభేధాలు మరోసారి భగ్గుమన్నాయి. మేడిపల్లి పోలిసు స్టేషన్ పరిదిలో ఈ ఇరువురు నేతల వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ కాస్తా ఒకరిపై మరొకరు రాళ్ల దాడికి పాల్పడే వరకు వెళ్లింది. మలిపెద్ది సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చిందంటూ మంత్రి మల్లారెడ్డి అనుచరులు ప్రచారం చేస్తున్నారంటూ మలిపెద్ది వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ప్రతాప్ సింగారం గ్రామంలో ఓ నిశ్చితార్థం కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి అనుచరులు ఆయన్ను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వీవాదం కాస్తా ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో కారు అద్దాలు ధ్వంసం అవడంతో పాటు ఒకరికి గాయాలైనట్టు తెలుస్తోంది. ( Telangana: ఒక్క రోజే 352 కరోనా కేసులు )


జెడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచర వర్గం తనపై దాడికి ప్రయత్నించిందంటూ ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ( Medipalli PS) ఫిర్యాదు చేశారు. అనంతరం ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..