దేశ వ్యాప్తంగా దాదాపు 18 రాష్ట్రాలలో కొత్త రకం కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని నెలలుగా తగ్గుముఖం పట్టినట్లుగా కనిపించిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు గత రెండు వారాలుగా విపరీతంగా పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ అమలు దిశగా చర్చలు జరుపుతున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ లాంటివి విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో సినిమా థియేటర్లు మరోసారి మూత పడనున్నాయని ప్రచారం జోరందుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

థియేటర్లు, సినిమా హాళ్లు మూతపడాయనే వదంతులపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ‘కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే చిత్ర పరిశ్రమ పై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న అనేకమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రంగంపై ఆధారపడిన వివిధ విభాగాలలోని కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొన్నది. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను థియేటర్ల యాజమాన్యాలు పాటించాలని’ సూచించారు.


Also Read: Corona Vaccine: దేశంలో 45 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా కరోనా టీకాలు, ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం


‘కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సినిమా దియేటర్లు యధావిధిగా నడుస్తాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో దియేటర్లు మూతపడనున్నాయని జరుగుతున్న ప్రచారం అబద్దం. సినిమా థియేటర్ల మూసివేతపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని’ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. కొన్ని లక్షల మంది జీవితాలు దీనిపై ఆధారపడి ఉన్నాయని, ఇప్పటికే భారీగా నష్టం వాటిల్లిందని చెప్పారు. కోవిడ్-19 నిబంధనలు పాటించి సినిమా థియేటర్లు, హాళ్లు పనిచేస్తాయని పేర్కొన్నారు.


Also Read: COVID-19 Cases: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ, GHMCలో పెరుగుతున్న కోవిడ్19 తీవ్రత  


తెలంగాణలో తాజాగా 431 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,04,298కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ నిన్న ఇద్దరు వ్యక్తులు మరణించారు. దీంతో తెలంగాణ(Telangana)లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,676కి చేరింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook