కరీంనగర్: చిన్నారులు, బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొస్తున్నా ఇంకా మార్పు రావడం లేదు. ఈ క్రమంలో కరీంనగర్ పట్టణంలో జరిగిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మూడో తరగతి చిన్నారిపై ఈ నెల 24న సామూహిక అత్యాచారం జరిగింది. స్థానిక అంబేడ్కర్ నగర్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న 9ఏళ్ల చిన్నారికి ముగ్గురు వ్యక్తులు మాయమాటలు చెప్పి తీసుకెళ్లారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి 


అక్కడ చిన్నారిని బెదిరించి ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం తమకేమీ తెలీదన్నట్లుగా చిన్నారిని ఇంటి దగ్గర వదిలి వెళ్లారు. తనకు తల, కడపునొప్పి వస్తుందని చిన్నారి ఏడ్వడంతో తల్లి ఏం జరిగిందో ఆరా తీసింది. జరిగిన దారుణాన్ని తెలుసుకుని ఆశ్చర్యానికి లోనైంది. కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


Also Read: తల్లా.. పెళ్లామా.. తేల్చుకోండి: అనసూయ


చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చిన్నారి, ఆమె తల్లి చెప్పిన వివరాల మేరకు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డవారిలో ఇద్దరు మేజర్లు కాగా, ఒకరు మైనర్ అని తెలుస్తోంది. చిన్నారులు, బాలికలపై వేధింపులు, అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


Also Read: తనకంటే 37 ఏళ్లు పెద్ద వ్యక్తితో నటి రిలేషన్


మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి 


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..