MLA Defection Case:  తెలంగాణలో గతేడాది చివర్లో జరిగిన ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతేకాదు అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డిని అధిష్ఠానం ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. అంతేకాదు అధికారం చేపట్టిన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీపై ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించాడు రేవంత్ రెడ్డి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 గతంలో కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ను విమర్శించిన రేవంత్ రెడ్డి.. అదే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపాడు. ఈ నేపథ్మంలో బీఆర్ఎస్ నుంచి స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే  దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సహా పలువురు ఎమ్మెల్యేగా పార్టీ మారారు. రేవంత్ రెడ్డి వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.


అంతేకాదు గత ఎన్నికల్లో కడియం కూతరు శ్రీహరి వరంగల్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అటు దానం నాగేందర్ కూడా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన సంగతి తెలిసిందే కదా. దానం నాగేందర్ మాత్రం ఎంపీగా ఓటమి పాలయ్యారు. అయితే.. ఈ ముగ్గురుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ స్వీకరించలేదంటూ ప్రతిపక్ష  పార్టీ కౌశిక్ రెడ్డి, వివేకానంద్ కోర్టు కెళ్లారు.  


అంతేకాదు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోపు స్పీకర్ అనర్హత వేటు వేయాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.ఈ రోజు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పై కోర్టు తీర్పు వెలువరించనుంది. మొత్తంగా కోర్టు తీర్పుపై అధికార కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.