హైదరాబాద్: టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్, బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లింగంజ్‌పై దాడి ఘటన కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి హైదరాబాద్ లోని ఓ పబ్‌లో కొందరు యువకులు, గుంపు రాహుల్ సిప్లిగంజ్‌పై మూకదాడికి పాల్పడింది. రాహుల్ స్నేహితురాలితో ఆ యువకులు అనుచితంగా ప్రవర్తించడాన్ని బిగ్ బాస్ 2 విన్నర్ అడ్డుకోవడంతోనే గొడవకు దారి తీసినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Must Read: వ్యభిచారం చేయలేదు.. నన్ను వదిలేయండి: నటుడు ఆవేదన 


రాహుల్‌పై పబ్‌లో కొందరు దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ సిప్లిగంజ్‌పై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కజిన్ రితేష్ రెడ్డి దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రితేష్ రెడ్డి తన స్నేహితులు, వర్గీయులతో కలిసి రాహుల్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని సమాచారం. బీరు బాటిళ్లు తలపై పగలకొట్టినా ఆవేశం చల్లారని రితేష్ రెడ్డి వర్గీయులు రాహుల్ ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తున్నట్లుగా వీడియో చూస్తే అర్థమవుతోంది.


రాహుల్ సిప్లింగంజ్‌పై బీరు సీసాలతో దాడి.. వీడియో వైరల్



ఈ దాడి ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. రాహుల్ స్నేహితురాలు ఎవరు, అసలు ఆమెతో ఎమ్మెల్యే వర్గీయులు అనుచితంగా ప్రవర్తించడంతోనే గొడవ మొదలైందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గచ్చిబౌలిలోని ఓ హాస్పిటల్‌లో ట్రీట్ మెంట్ తీసుకుని రాహుల్ తన ఇంటికి వెళ్లినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


అందాల భామ అనన్య లేటెస్ట్ ఫొటోలు


Also Read: గర్భవతిని కాదు.. నా మాట నమ్మండి : యాంకర్ 


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..