Jabardasth Comedian Dorababu: నేను వ్యభిచారం చేయలేదు.. ఆ ప్రచారం ఆపేయండి: బుల్లితెర నటుడు ఆవేదన

Jabardast Artist Dorababu: విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ వ్యభిచార గృహంలో జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, పరదేశి సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Last Updated : Mar 5, 2020, 07:06 AM IST
Jabardasth Comedian Dorababu: నేను వ్యభిచారం చేయలేదు.. ఆ ప్రచారం ఆపేయండి: బుల్లితెర నటుడు ఆవేదన

బుల్లితెర నటులు, జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, పరదేశి (Vizag Sex Racket) సెక్స్ రాకెట్‌లో అడ్డంగా దొరికిపోవడం టీవీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. అయితే దొరబాబు దొరకడమేమోగానీ మరో నటుడికి తలప్రాణం తోకకొస్తుందట. దీనిపై నటుడు దావూద్ స్పందించారు. అసలు విషయాలు వెల్లడించాడు. వ్యభిచారం చేస్తూ పట్టుబడింది తాను కాదనీ, అదే పోలికలతో ఉండే జబర్దస్త్ నటుడు దొరబాటు అని స్పష్టం చేశారు. గతంలో డబుల్ యాక్షన్ థీమ్ స్కిట్‌లో భాగంగా దొరబాబుతో కలిసి దావూద్ సందడి చేసిన విషయం తెలిసిందే.

Also Read: గర్భవతిని కాదు.. నా మాట నమ్మండి : యాంకర్ 

అయితే టీవీల్లో, సోషల్ మీడియాలో దొరబాబు సెక్స్ రాకెట్‌లో దొరికిపోవడం చూసి నేనేమోనని అపోహపడుతున్నారని చెప్పారు. నువ్వు ఇలాంటి పనులు చేస్తావనుకోలేదంటూ బూతులు తిడుతున్నారని ఆందోళన చెందారు. వాస్తవానికి వైజాగ్‌లో దొరికిపోయింది తన పోలికలతో ఉండే జబర్దస్త్ కమెడియన్ దొరబాబు అని, అతడు హైపర్ ఆది టీమ్‌లో స్కిట్లు చేస్తాడన్నారు. అతడితో పాటు మరికొందర్ని విశాఖ టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకున్నట్లు దావూద్ చెప్పారు.

అందాల భామ అనన్య లేటెస్ట్ ఫొటోలు

కాగా, తాను డియర్ కామ్రెడ్, అర్జున్ సురవరం మరికొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు వేశానని చెప్పారు. పలు సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెర మీద మంచిపేరు సంపాదించుకున్నానని.. అయితే తాను చేయని పనులను తనకు అంటకట్టడం మంచిది కాదని, ఇకనైనా ఇలాంటి వదంతులకు చెక్ పెట్టాలని నెటిజన్లను, సన్నిహితులను కోరారు.

Also Read: సెక్స్ రాకెట్ కేసులో ఇద్దరు జబర్దస్త్ నటులు అరెస్ట్

See Pics: టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వక ముందే మోడల్ రచ్చ రచ్చ 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News