Sameera: గర్భవతిని కాదు.. నా మాట నమ్మండి, కానీ : యాంకర్ సమీర

అదిరింది కామెడీ షో యాంకర్ సమీరా షెరిఫ్ ప్రెగ్నెంట్ అని, అందుకే ఆమెను షో నుంచి తప్పించారని వదంతులు షికార్లు చేశాయి. ఆ వదంతులకు ఒక్క వీడియోతో చెక్ పెట్టారు యాంకర్ సమీర.

Updated: Mar 3, 2020, 12:02 PM IST
Sameera: గర్భవతిని కాదు.. నా మాట నమ్మండి, కానీ : యాంకర్ సమీర
Screens Grabbed from Sameera Instagram Video Post

జబర్ధస్త్ షో నుంచి నాగబాబు బయటకు వచ్చేసి అదిరింది షోలో జడ్జీగా మరోకొత్త కామెడీ షోతో కొనసాగుతున్నారు. తొలుత నాగబాబు అదిరింది నుంచి వెళ్లిపోతున్నారని ప్రచారం జరగింది. తాజాగా అదిరింది హోస్ట్ సమీరా షెరిఫ్ గురించి కొన్ని వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. సమీర ప్రెగ్నెంట్ అయ్యిందని, అందుకే ఆమె షో నుంచి వెళ్లిపోయిందని కొందరు ప్రచారం చేస్తుంటే, సమీర కావాలనే షో నుంచి తప్పుకున్నారని, షోకు మరింత గ్లామర్ కావాలని అడిగితే అందుకు ఆమె ఒప్పుకోలేదని పుకార్లు షికార్లు చేశాయి.

Also Read: ప్రభాస్‌కు ఆ సత్తా ఉంది: ఆకాశానికెత్తేసిన దర్శకుడు

తనపై వచ్చిన వదంతులు, అదిరింది నుంచి తప్పుకోవడంపై సమీర స్పందించారు. తొలుత కేవలం 26 ఎపిసోడ్ల కోసం మాత్రమే తనను సంప్రదించారని, ఇక నుంచి తాను అదిరింది షోలో భాగస్వామిని కానని స్పష్టం చేశారు. అయినా సరే హోస్ట్ చేయకున్నా సూపర్ షో కనుక షో నుంచి బయటకి వెళ్లిపోయినా చూస్తానని మేనేజ్ మెంట్ కు చెప్పానని గుర్తు చేసుకున్నారు. రూమర్ల గురించి చెప్పాలంటే.. మీరు కావాలని తప్పుకున్నారా అని ప్రచారం జరుగుతోంది. కానీ అందులో ఏమాత్రం నిజం లేదన్నారు.

అందాల భామ అనన్య లేటెస్ట్ ఫొటోలు

‘13, 15ఏళ్ల నుంచి కెరీర్ కొనసాగిస్తున్నాను. ఎన్నో టెక్నికల్ కారణాలు ఉంటాయి. చాలా గ్లామరస్‌గా ఉండాలని వాళ్లు భావించి ఉండవచ్చు. అయితే ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. అందరూ ఒకేలా ఉండరు. నా స్థానంలో ఎవర్ని తీసుకున్నారని నేను అడగలేదు. వాళ్లు కూడా చెప్పలేదు. అయితే రవి, భాను షో చేయబోతున్నారని ప్రోమో చూస్తే తెలిసింది. రవి, భానుకు ఆల్ ది బెస్ట్. సమీరాకు కేవలం 10 ఎపిసోడ్ల కాంట్రాక్ట్, అందుకే వెళ్లిపోయిందని అంటున్నారు. మరికొందరేమో నేను ప్రెగ్నెంట్ అని షో నుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే  నేను ప్రెగ్నెంట్ కాదని స్పష్టం చేస్తున్నాను.

See Pics: టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వక ముందే మోడల్ రచ్చ రచ్చ  

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Here’s the real reason behind it. Talking about the rumours.

A post shared by Sameera Sherief (@sameerasherief) on

త్వరలో మరో షోతో మీ ముందుకు వస్తాను. అదిరింది షోలో చేయడం తప్పు నిర్ణయం కాదని భావిస్తాను. ప్రతి షో నుంచి మనం ఎంతో కొంత నేర్చుకుంటాం. మీరు ఏడుస్తుంటే మాకు కన్నీళ్లు ఆగడం లేదని కొందరు చెప్పారు.  మీ ప్రేమ, ఆప్యాయత చూపినందుకు ధన్యవాదాలు. మరికొందరేమో యాంకర్‌ను మార్చండి అని పదే పదే చెప్పడంతో తీసేశారనడం సరికాదని’ యాంకర్ సమీరా సూచించారు.

అదిరింది షో డైరెక్టర్లు నితిన్, భరత్.. గల్లీ బాయ్స్, టీమ్ లీడర్లు ధన్‌రాజ్, వేణు, చంద్ర.. షో జడ్జీలు నాగబాబు, నవదీప్ అందరూ నాకెంతగానో సాయం చేశారు. ఇకనుంచి కూడా అదిరింది అదిరిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. షో నుంచి బయటకు వచ్చినా ఎలాంటి వ్యతిరేకమైన కామెంట్ల చేయకుండా అసలు విషయాన్ని చెప్పారు సమీరా.

Also Read: అది లుంగీనా.. లంగానా..? స్పందించిన హీరోయిన్

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..