MLC Kavitha Delhi Liquor Scam ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు వస్తుందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇక ఇప్పుడు అదే నిజమైంది. అమిత్ ఆరోరా ఇచ్చిన రిపోర్టులో కవిత పేరు ఉంది. దీంతో కవితను విచారిస్తారా? అరెస్ట్ చేస్తారా? అంటూ అనేక చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కవిత ఇంటికి చేరుకున్నారు. ఇక కవిత సైతం మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ తీరును ఎండగట్టే ప్రయత్నం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతు.. మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎనిమిదేళ్లు అయిందని, ఈ ఎనిమిది ఏళ్లలో తొమ్మది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారని దుయ్యబట్టారు. ఏ రాష్ట్రంలో ఎన్నికల జరగబోతోంటో.. ఆ రాష్ట్రంలోకి మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుందని దేశ ప్రజలందరికీ తెలిసిందే అని కవిత చెప్పుకొచ్చింది. ఎన్నికలకు ముందు ఈడీలతో సోదాలు చేయించడం కామన్ అని చెప్పేసింది.


టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఈడీ, సీబీఐలతో దాడులు చేయించడం, బీజేపీ నీచ రాజకీయ ఎత్తుగడ అని మండిపడింది. ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం చెబుతామని, ఈడీలకు, సీబీఐలకు భయపడేది లేదు అని తెగేసి చెప్పింది. జైల్లో పెట్టడం కంటే, ఎక్కువ చేసేది ఏమి లేదు అని కేంద్రాన్ని ఎండగట్టేసింది. మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పంధాన్ని మార్చుకోవాలని, ఇదంతాకూడా తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని కవిత మీడియాతో మాట్లాడింది.


Also Read : Tatti Annaram case : తండ్రి ఫోన్‌లో ఆశ్లీల వీడియోలకు మరిగి.. పదోతరగతి బాలికపై అత్యాచారం కేసులో వింత విషయాలు


Also Read : Shruti Haasan Trolls : మేకప్ లేని ఫోటోపై ట్రోలింగ్..ఇక సమాజం ఎప్పటికీ మారదు.. శ్రుతి హాసన్ అసహనం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook