MLC Kavitha Vs YS Sharmila: ఎమ్మెల్సీ కవితకు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ట్విట్టర్ వారు జరుగుతోంది. ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. 'తాము వదిలిన “బాణం” తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు”..' అని కవిత ట్వీట్ చేయగా.. 'పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు..' అంటూ కౌంటర్ ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 




తాజాగా షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మరో ట్వీట్ చేశారు.  తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఆమె ఎండగట్టారు. షర్మిల బీజేపీ కోవర్టు అంటూ ఆరోపణలు గుప్పించారు. పొలిటికల్ టూరిస్టును కాదని.. ఉద్యమ బిడ్డను అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు.
 
“అమ్మా.. కమల బాణం.. ఇది మా తెలంగాణం.. పాలేవో నీళ్ళేవో తెలిసిన చైతన్య ప్రజా గణం.. మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు.. నేడు తెలంగాణ రూటు 
మీరు కమలం కోవర్టు.. ఆరేంజ్ ప్యారెట్టు.. మీ లాగా పొలిటికల్ టూరిస్ట్ కాను నేను.. రాజ్యం వచ్చాకే రాలేదు నేను.. ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి 'కవిత'ను నేను!” అంటూ కవిత ట్వీట్ చేశారు. 


 




 
అంతకుముందు టీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల విమర్శలుగు గుప్పిస్తూ ట్వీట్లు చేశారు. “ఒకప్పుడు టీఆర్ఎస్ ఉద్యమకారుల పార్టీ.. ఇప్పుడు ‘గూండాల పార్టీ, బంధిపోట్ల పార్టీ’. ఒక మహిళ 3500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి, కేసీఆర్ మోసాలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే.. ఓర్వలేక మాపై పెట్రోల్ దాడులకు పాల్పడ్డారు. ప్రజల పక్షాన నిలబడడం మా తప్పా..? ఇది తెలంగాణ కాదు ఆఫ్ఘనిస్తాన్.


కేసీఆర్ ఒక తాలిబన్. నర్సంపేటలో, హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించింది టీఆర్ఎస్ గూండాలు, పోలీసులే. టీఆర్ఎస్ గూండాలను వదిలిపెట్టి, మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. పోలీసులు కేసీఆర్‌కు తొత్తుల్లా మారారు. నిబంధనలకు విరుద్ధంగా మా పార్టీ కార్యకర్తలను తీవ్రంగా కొట్టారు.


దాడులు చేసే హక్కు పోలీసులకు ఎక్కడిది..? ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుని, గూండాలకు కొమ్ముకాస్తారా..? ఒక మహిళపై దాడి చేయించడానికి కేసీఆర్‌కు సిగ్గుండాలి. ఇది దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం. కేసీఆర్ ఎన్ని కుట్రలు పన్నినా ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆగదు..” అంటూ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు.


Also Read: Pak Vs Eng: పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ జట్టులో కలకలం.. 14 మంది ఆటగాళ్లకు అస్వస్థత 


Also Read: India Vs New Zealand: మూడో వన్డే కూడా రద్దు.. న్యూజిలాండ్‌దే సిరీస్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి