Balagam Mogiliah Dead: తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో విడుదలైన బలగం సినిమా జానపద కళాకారుడు మొగిలయ్య. ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం  పరిస్థితి విషమించటంతో ఆయన తుది శ్వాస విడిచారు. బలగం సినిమాలో క్లైమాక్స్ లో భావోద్వేగ పాటను ఆలపించి ప్రేక్షకుల హృదయాలను ఆయన హత్తుకున్నారు. కొన్ని రోజులుగా మొగిలయ్య కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.  తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయనకు సహాయం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదీ చదవండి : మరింత బలపడిన అల్పపీడనం.. 24 గంటల్లో ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..  


బలగం మొగిలయ్య మృతితో ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు. మొగిలయ్య వరంగాల్‌ జిల్లావాసి. ఆయన మృతి పట్లు బలగం డైరెక్టర్‌ వేణు యెల్దండి కూడా తీవ్ర సంతాపం తెలయజేశారు. మొగిలయ్య డయాలసీస్‌ చేయించుకుంటు గత ఏడాదిగా మంచానికే పరిమితమయ్యారు. వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈయన చికిత్స నిమిత్తం బలగం సినిమా డైరెక్టర్‌ వేణు యెల్దండితోపాటు ఇతర ప్రముఖులు, తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. హైదరాబాద్‌లో మెరుగైన వైద్య చికిత్స అందించారు. మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఆర్థిక సహాయం అందించారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో మరణించారు. ఈ సినిమాతో ఆయన పాటతో ప్రాణం పోశారు. ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇక చాలామంది ఆ పాటుకు కంటతడి పెట్టని వారు అంటేలేరు. అన్నాచెల్లెలు, తమ్ముడు బంధాలపై రాసిన ఆ పాట ఎప్పటికీ మరువనిది.
 


ఇదీ చదవండి :  ప్రెగ్నెంట్‌ అని తెలియగానే షాకయ్యా.. రాధిక ఆప్టే బోల్డ్‌ ఫోటో షూట్‌ వైరల్‌..


 


వరంగల్ దుగ్గొండి లో మొగిలయ్య దంపతులు బుర్రకథలు చెప్పుకుంటూ జీవనం సాగించేవారు. అదే వీరికి జీవనాధారం. ఇక వేణు ఎల్దండి రూపొందించిన బలగం సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ నటించారు. తక్కువ బడ్జెట్ లో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.


ఈ సినిమా తర్వాత మొగిలయ్య రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆయన డయాలసిస్ చేయించుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన శరీరంలో ఆపరేషన్‌ పాయింట్ దొరక్క 11 చోట్ల రంద్రాలు కూడా చేశారట. చివరిగా ఛాతి నుంచి రక్తం ఎక్కించారు. దీంతో ఆయన పరిస్థితి మరింత దిగజారింది..ఆయన వైద్యం నిమిత్తం లక్షల్లో అప్పు కూడా చేశామని ఆయన సతీమణి మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు.ఈ బలగం సినిమా దిల్ రాజ్‌ బ్యానర్లో వచ్చింది. దర్శకుడు వేణు జబర్దస్త్‌ కామెడీ షో ద్వారా పరిచయం అయ్యారు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోనే దర్శకత్వం ప్రారంభించారు. బలగం సినిమా మంచి ఫేమ్‌ తీసుకువచ్చింది.  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.