Telangana Heavy Rains: వర్షాకాలంలో తెలంగాణలో సాధారణ వర్షాపాతం కన్నా అధిక వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించింది. భారీ వర్షాలు ఐదు రోజుల పాటు పడతాయని వెల్లడించింది. భారీ స్థాయిలో వర్షాలు పడుతాయని అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వానికి వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యమంత్రి దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Weather Report: తెలంగాణకు హై అలర్ట్‌.. రేపు జిల్లాలకు భారీ వర్ష సూచన


ఉత్తర తమిళనాడు పరిసరాల్లో నెలకొన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తాంధ్రతోపాటు తెలంగాణపై ప్రభావం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాటి ప్రభావంతో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది. గంటలకు 40 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించింది. ఉరుములు మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.

Also Read: BRS Party: తెలంగాణలో ముదురుతున్న 'అసభ్య' వివాదం.. రేవంత్‌ రెడ్డిపై ఠాణాలో ఫిర్యాదు


భారీ వర్షాలు పొంచి ఉన్న జిల్లాలు
ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, వికారాబాద్‌, నారాయణపేట, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల,


మోస్తరు వర్షాలు పడే జిల్లాలు
జగిత్యాల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి. ఇవి కాక మిగతా జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది.


నీటి పారుదల శాఖ అప్రమత్తం
రాష్ట్రంలో భారీ వర్షాల కురుస్తాయని వాతావరణ  శాఖా హెచ్చరికల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ భద్రత చర్యలు చేపట్టాలని నీటి పారుదల శాఖకు ఆదేశించారు. రిజర్వాయర్లు, చెరువులను పర్యవేక్షించడానికి ఇంజనీర్ల బృందం సిద్ధంగా ఉండాలని చెప్పారు. నీటి పారుదల ఇంజినీర్ల విభాగం తమ తమ నిర్దేశిత ప్రాంతంలో అందుబాటులో ఉండాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే తక్షణమే ఈఎన్‌సీ జనరల్, ఈఎన్‌సీఓఎంలను అప్రమత్తం చేయాలని సూచించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter