Lockdown: తల్లడిల్లిన తల్లి గుండె.. కొడుకు కోసం 1,400 కిలోమీటర్ల ప్రయాణం
కరోనా వైరస్ వ్యాప్తి ప్రబలుతున్న కారణంగా రాష్ట్ర, దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో తన కుమారుడు వేరే రాష్ట్రంలో చిక్కుకున్నాడని తెలియగానే ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయిందని స్థానికులు తెలిపారు.
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి ప్రబలుతున్న కారణంగా రాష్ట్ర, దేశ వ్యాప్తంగా లాక్ డౌన్(Lockdown) విధించిన నేపథ్యంలో తన కుమారుడు వేరే రాష్ట్రంలో చిక్కుకున్నాడని తెలియగానే ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయిందని స్థానికులు తెలిపారు. అధికారుల అనుమతి తీసుకుని, స్కూటీపై సుమారుగా 1,400 కిలోమీటర్లు ప్రయాణించి ఇంటికి చేరారు.
Read Also: Read Also: కరోనా బాధితులకు వైద్యానికి సిద్దమైన బ్యూటీ క్వీన్..
బోధన్‌కు చెందిన రజియాబేగం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. నిజాముద్దీన్ అనే తన కుమారుడు ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని నారాయణ మెడికల్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటున్నాడని, స్నేహితుడి తండ్రి ఆరోగ్యం బాగా లేదని తెలియడంతో అతడికి తోడుగా నిజాముద్దీన్ మార్చి 12 నెల్లూరుకు వెళ్లగా ఇదే సమయంలో కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో అతడు∙చిక్కుకుపోయాడని తెలిపింది.
Also Read: Read Also: సోనియా గాంధీపై మీడియా సొసైటీ నిరసన...
కామారెడ్డిలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. విషయం తెలియగానే రజియాబేగం బోధన్ ఏసీపీ జైపాల్‌రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించగా ఆయన ఇచ్చిన అనుమతి పత్రం తీసుకుని 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరుకు సోమవారం ఉదయం స్కూటీపై బయల్దేరి మంగళవారం మధ్యాహ్నం అక్కడకు చేరుకున్నానని, కుమారుడితో కలిసి అదే స్కూటీపై సాయంత్రం తిరుగు ప్రయాణమై బుధవారం మధ్యాహ్నం కామారెడ్డికి చేరుకున్నామని తెలిపారు.
Also Read: ఏప్రిల్ 22 నాటికీ కరోనా ఫ్రీ తెలంగాణ.. మంత్రి ఈటెల ఆశాభావం..
తన కొడుకును చూడాలనే తపన తనను అంతదూరం వెళ్లేలా చేసిందని, కుమారుడిని ఇంటికి క్షేమంగా తీసుకురావడమే లక్ష్యంగా వెళ్లానని, అటవీ ప్రాంతం గుండా వెళ్లినా భయం అనిపించలేదన్నారు. చాలా చోట్ల పోలీసులు ఆపారని, బోధన్ ఏసీపీ ఇచ్చిన లెటర్‌ను చూపించడంతో అనుమతించారని వివరించారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..