సోనియా గాంధీపై మీడియా సొసైటీ నిరసన...

మీడియా రంగానికి ప్రభుత్వ పరమైన ప్రకటనలు నిలిపివేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సూచనపై ఇండియన్ న్యూస్‌పేపర్స్ సొసైటీ (ఐఎన్‌ఎస్) తీవ్రమైన నిరసన వ్యక్తం చేసింది. సోనియా గాంధీ ప్రతిపాదన సహేతుకమైనది కాదని, 

Last Updated : Apr 10, 2020, 12:07 AM IST
సోనియా గాంధీపై మీడియా సొసైటీ నిరసన...

న్యూఢిల్లీ: మీడియా రంగానికి ప్రభుత్వ పరమైన ప్రకటనలు నిలిపివేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సూచనపై ఇండియన్ న్యూస్‌పేపర్స్ సొసైటీ (ఐఎన్‌ఎస్) తీవ్రమైన నిరసన వ్యక్తం చేసింది. సోనియా గాంధీ ప్రతిపాదన సహేతుకమైనది కాదని, స్వేచ్ఛాయుత, శక్తివంతమైన మీడియా రంగానికి ఇటువంటి సూచనలు బలహీనపరుస్తాయని, ఆర్థికపరమైన సెన్సార్‌షిప్‌గా మారుతాయని వార్తాపత్రికల కార్యవర్గం విమర్శించింది. 

Read Also: కరోనా బాధితులకు వైద్యానికి సిద్దమైన బ్యూటీ క్వీన్..

కరోనామహమ్మారితో సంక్షోభానికి గురైన దేశ ఆర్ధిక పరిస్థితి, ఆర్థిక చిక్కుల పరిష్కారానికి ఇటీవలే(Sonia Gandhi) సోనియా గాంధీ ఐదు ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. సుమారుగా రెండు సంవత్సరాల పాటు అన్నీ రకాల మీడియాలకు ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రకటనలను నిలిపివేయాలని సూచించడం వివాదాస్పదం అయింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మీడియాపై ఈ రకమైన సూచన కేంద్ర ప్రభుత్వానికి చేయడం సరైనది కాదని, ఈ ప్రతిపాదనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఐఎన్‌ఎస్ అధ్యక్షులు శైలేష్ గుప్తా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News