న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పటికే ఎంతో మంది తారలు, సెలబ్రెటీస్ తమ వంతు సహాయం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా భారత సంతతికి చెందిన ఓ మోడల్ బ్యూటీ క్వీన్ తన వైద్య సహాయ సహకారాలను అందించేందుకు ముందడుగేసింది. కరోనాను ఎదుర్కొనేందుకు తనవంతుగా ‘మిస్ ఇంగ్లాండ్’ భాషా ముఖర్జీ వైద్యురాలిగా సేవలందిచడానికి సన్నద్ధమైంది. ఈ అందాల భామ నాటింగ్హామ్ యునివర్సిటీ నుంచి మెడికల్ సైన్స్, మెడిసిన్ ఆండ్ సర్జెరీ లలో రెండు బ్యాచిలర్ డిగ్రీ పట్టాలు తీసుకుంది.
తనకు మోడలింగ్ మీదున్న ఇష్టంతో భాషా ముఖర్జీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మోడలింగ్ లోకి ప్రవేశించింది. 2019, ఆగస్టులో మిస్ ఇంగ్లాండ్ కిరీటాన్ని దక్కించుకున్న ఆమె గత మార్చి నెలలో భారత్ పర్యటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో మళ్లీ ఇంగ్లాండు బయలుదేరింది. ప్రపంచాన్నికబళిస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటంలో తన సహకారాన్నిఅందించాలని యూకే జూనియర్ డాక్టర్ గా మళ్లీ తన మెడికల్ కెరీర్ ను ప్రారంభించాలని ఆమె నిర్ణయించుకుంది.
భాష ముఖర్జీ వైద్యురాలిగా సేవలందించే ముందు రెండు వారాల పాటు స్వీయ క్వారంటైన్ పాటించనున్నట్లు, ఇది పూర్తైన వెంటనే బ్యూటీ క్వీన్ బోస్టన్ లోని పిలిగ్రిమ్ హాస్పిటల్ లో కరోనా బాధితులకు డాక్టర్ గా సేవలందించబోతున్నట్లు పేర్కొంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..