ఏప్రిల్ 22 నాటికీ కరోనా ఫ్రీ తెలంగాణ.. మంత్రి ఈటెల ఆశాభావం..

రాష్ట్రవ్యాప్తంగా గురువారం 18 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, ఈ రోజు 665 నమూనాలను పరీక్షలకు పంపగా 18 మందికి పాజిటీవ్ అని తేలిందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల వెల్లడించారు.

Last Updated : Apr 10, 2020, 12:39 AM IST
ఏప్రిల్ 22 నాటికీ కరోనా ఫ్రీ తెలంగాణ.. మంత్రి ఈటెల ఆశాభావం..

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం 18 కొత్తగా (coronavirus)కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, ఈ రోజు 665 నమూనాలను పరీక్షలకు పంపగా 18 మందికి పాజిటీవ్ అని తేలిందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 471కి చేరిందని, ఒక రోగికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని, మరొకరు మృతి చెందారని తెలిపారు. 

Read Also: సోనియా గాంధీపై మీడియా సొసైటీ నిరసన...

రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య ఇప్పటివరకు 12కు చేరిందని, ప్రస్తుతం 414 మందికి హైద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని, నేడు(శుక్రవారం) 70 మంది డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు ఇప్పటికే 45 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, ఏప్రిల్ 22 నాటికి కరోనా బాధితులు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అవుతారని అన్నారు. 

Also Read: Read Also: కరోనా బాధితులకు వైద్యానికి సిద్దమైన బ్యూటీ క్వీన్..

ఢిల్లీలోని తబ్లీఘీ జమాత్ (మర్కజ్)కు సంబంధించిన కరోనా కేసులు లేకుంటే ఇప్పటికే కరోనా ఫ్రీ తెలంగాణగా ఉండేదని, గాంధీ ఆసుపత్రిలో కేవలం కరోనా పాజిటీవ్ ఉన్న వారికే చికిత్స అందిస్తున్నామని బయటి రోగుల కొరకై కోసం కింగ్ కోఠి ఆస్పత్రికి వెళ్లాలని మంత్రి సూచించారు. ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 101 హాట్ స్పాట్ ప్రాంతాలను గుర్తించామని హాట్ స్పాట్ ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News