MP Komatireddy Venkat Reddy: మా రేవంత్‌కి కోపం ఎక్కువ.. ఒకటి అంటే నాలుగు తిడతాడు: ఎంపీ కోమటిరెడ్డి
TPCC Leaders Meeting: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో బుధవారం టీపీసీసీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. అభిప్రాయ భేదాలు మరిచిపోయి.. ఇక నుంచి కలిసి పనిచేద్దామని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. త్వరలోనే బస్సు యాత్ర నిర్వహిస్తామని తెలిపారు.
TPCC Leaders Meeting: ఎన్నికల యుద్దానికి 100 రోజులు మాత్రమే ఉందని కాంగ్రెస్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ యుద్ధంలో గెలవాల్సింది కాంగ్రెస్ కాదు అని.. ప్రజలు అని అన్నారు. బుధవారం కోమటిరెడ్డి నివాపంలో టీపీసీసీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. అందరూ కలికట్టుగా ఉండాలని ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. విధి విధానాలపై పీఎసీలో మాట్లాడతామన్నారు. ఇప్పటివరకు ఉన్న అభిప్రాయ భేదాలు మరిచిపోదామని.. కలిసి పనిచేద్దామని అన్నారు.
"30వ తేదీ ప్రియాంక గాంధీ సభలో మహిళా డిక్లరేషన్ ప్రకటిస్తాం.. ధరణితో లక్షలాది మంది రైతులు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగ భృతి లేదు.. ప్రజల వద్దకు వెళ్లి అన్ని చెప్పుకుంటాం.. మేము ఐదారు కార్యక్రమాలు చెపడతాం.. మేము మాట్లాడేవి చెబితే 4 నెలల తరువాత ఖాళీ చేసే ప్రగతి భవన్‌ను ఇప్పుడే ఖాళీ చేస్తారు.. బీసీ నేత డీఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. బీసీలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీనే..
తలసాని అంటే ఓ విగ్గురాజా.. పాన్ పరక్ రాజా.. మా రేవంత్‌కు కోపం ఎక్కువ.. ఒకటి అంటే నాలుగు తిడతాడు.. మా బీసీ నేత మహేష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు.. మా పీసీసీ బీసీలను తిట్టలేదు.. మా పీసీసీని అంటే ఎవరు భయపడరు.. నేను లాగ్ బుక్ బయటపెట్టిన తరువాతనే 24 గంటల కరెంట్ ఇస్తున్నారు.. రేవంత్ బీసీలను ఏమన్నాడు..? ఒక ఎంపీ, పార్టీ అధ్యక్షుడిని పట్టుకొని ఇష్టమొచ్చిన్నట్లు తిడతారా...?" అంటూ కోమటిరెడ్డి మండిపడ్డారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో నేతలు కొత్తగా చేరాల్సిన అవసరం లేదని ఆయన సమావేశానికి ముందు అభిప్రాయపడ్డారు. 12కు 12 స్థానాలు రిజర్వ్ అయిపోయాయని అన్నారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కోదాడ శశిధర్ రెడ్డి పార్టీలో చేరే అంశం ఇప్పటివరకు చర్చకు రాలేదన్నారు. త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రోడ్ మ్యాప్ కోసమే ముఖ్యనేతలను ఆహ్వానించానని అన్నారు. ఆగస్టు నుంచి ప్రచారాన్ని ఉధృతం చేస్తామన్నారు. అందరం కలిసికట్టుగా బస్ యాత్ర చేయాలనేది తన కోరిక అని అన్నారు.
ఏఐసీసీ కార్యదర్శి సంపత్ మాట్లాడుతూ.. సమావేశంలో తెలంగాణ రాజకీయాలపై చర్చ జరిగిందని తెలిపారు. ఎన్నికల వ్యూహలపై చర్చించామని అన్నారు. త్వరలో పీఏసీ నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. 30వ తేదీ కొల్లాపూర్ సభకి ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని కోరామని అన్నారు. అంతర్గత సమస్యలు పీఏసీలో చర్చిస్తామన్నారు. బెంగుళూరులో రెండు రోజుల సమావేశాలు జరిగాయని.. యూపీఏని ఇండియాగా నామకరణం హర్షించదగిన విషయన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలు నేలమట్టమై.. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రాబల్యం పెరుగుతుందన్నారు.
Also Read: Ongole Attack Video: ఒంగోలులో దారుణం.. యువకుడి నోట్లో మూత్రం పోసిన దుండగులు
Also Read: Viral Video: జేసీబీపై దూసుకువచ్చిన భారీ బండరాళ్లు.. క్షణాల్లో తప్పించుకున్న డ్రైవర్.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook