MP Komatireddy Fires On Minister KTR: మంత్రి కేటీఆర్‌పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవడిదిరా బానిసత్వ పార్టీ అంటూ ఫైర్ అయ్యారు. కేటీఆర్ అమిత్ షాని కలిసిన తర్వాత కవిత కేసు ఆగిపోయిందని విమర్శించారు. కేటీఆర్‌కి కొంత నాజెడ్జ్ ఉందని అనుకున్నానని.. ఈరోజు చిట్ చాట్ తర్వాత  ఏం తెలియదని అర్థమైందని అన్నారు. కేసీఆర్‌కి దమ్ముంటే ఆయన్ని బండ బూతులు తిట్టిన దానం, తలసాని ని కేబినెట్ నుంచి తొలగించాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఒక్కశాతం మాత్రమేనని అన్నారు. కేసీఆర్ 115 మందిని ప్రకటించి.. ఒక్కొక్కరికి 10 కోట్లు ఇచ్చి పంపారని ఆరోపించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేటీఆర్ రాజకీయాలపై అనుభవం లేని వ్యక్తి అని.. తాము తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు అమెరికాలో ఉన్నాడని కోమటిరెడ్డి గుర్తుచేశారు. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవడంతోనే కేసీఆర్ బయటకి వచ్చి పార్టీ పెట్టాడని.. రాజశేఖర్ రెడ్డిని ఎదిరించి తాము తెలంగాణ కోసం కొట్లాడామని అన్నారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ అన్నారని.. కానీ సోనియా పాత్ర లేదని కేటీఆర్ అంటున్నాడని పేర్కొన్నారు. పిల్లల మరణాలకు చలించి సోనియా తెలంగాణ ఇచ్చారని.. కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం కేటీఆర్‌కు తగదని హితవు పలికారు. 


"కాంగ్రెస్ హయాంలో ఒకటవ తారీఖున పింఛన్లు వచ్చేవి. ప్రభుత్వం ఎన్ని డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిందో చెప్పాలి. ఎన్నికలు వస్తున్నాయనే పాలమూరు ప్రాజెక్టు ప్రారంభిస్తున్నారు. దానం నాగేందర్ కట్టే పట్టుకొని తెలంగాణ ఉద్యమకారులను కొట్టాడు. అరేయ్ కేసీఆర్ ఫుట్ బాల్‌లాగా తంతాను అన్న తలసాని మంత్రి ఎలా అయ్యాడు..? తెలంగాణ ద్రోహులను నీ పార్టీలో పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారు..? పార్లమెంట్‌లో కేసీఆర్ ఒక్కసారైనా తెలంగాణ కోసం మాట్లాడాడా..? కేబినెట్ మంత్రుల్లో చాలా మంది తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్లే.. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ రాకపోయేది. తెలంగాణ ఏర్పాటులో సోనియా పాత్ర లేకపోతే కేసీఆర్ కుటుంబం సోనియాని ఎందుకు కలిశారు..? ఎందుకు గ్రూప్ ఫోటో దిగారు.


తెలంగాణ ద్రోహులు, కేసీఆర్‌ని తిట్టిన వారిని సస్పెండ్ చేయాలి. మీ తండ్రిని ఫుట్ బాల్ ఆడతానని తిట్టినా వాళ్ళని కేబినెట్లో పెట్టుకోవడానికి సిగ్గులేదా..? మహమూద్ అలీ, పద్మా దేవేందర్ రెడ్డిలను బానిసలాగా చూసింది కేసీఆర్. మంత్రులకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం బానిసత్వం కాదా..? దట్టిలు కట్టడానికి తప్పా మహమూద్ అలీ దేనికి పనికిరాడు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రులు అవుతారు. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కేసీఆర్, తర్వాత కేటీఆర్, ఆ తర్వాత హిమన్ష్ ముఖ్యమంత్రి. మా చెల్లిని అరెస్ట్ చేయకండి. ఎన్నికలు ఎప్పుడైనా పెట్టుకోండి అని కేటీఆర్ అమిత్ షాకి చెప్పి వచ్చాడు. కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి.. మూడు ఎకరాల డిక్లరేషన్ ఏమైంది..? దలితబంధు, బీసీ బంధులో అక్రమాలపై కోర్టుకు వెళ్తున్నాను.." అని కోమటిరెడ్డి తెలిపారు.



Also Read: IND Vs SL Asia Cup Super 4 Match Updates: టాస్ గెలిచిన భారత్.. తుది జట్టులో మార్పులు.. ఆ ప్లేయర్ ఎంట్రీ..!  


Also Read: Ys jagan on Chandrababu Case: చంద్రబాబు అరెస్టు పరిణామాలపై జగన్ సమీక్ష



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook